Paneer : పన్నీర్ అసలైందేనా లేదా నకిలీదా… వంటింటి చిట్కాలతో తెలుసుకోండిలా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Paneer : పన్నీర్ అసలైందేనా లేదా నకిలీదా… వంటింటి చిట్కాలతో తెలుసుకోండిలా..!

 Authored By ramu | The Telugu News | Updated on :8 February 2025,5:40 pm

ప్రధానాంశాలు:

  •  Paneer : పన్నీర్ అసలైందేనా లేదా నకిలీదా... వంటింటి చిట్కాలతో తెలుసుకోండిలా..!

Paneer  : నేటి ఆధునిక కాలంలో మార్కెట్లో ప్రతి ఒక్కటి నకిలీ మయం అవుతుంది. ఇక కొంతమంది వ్యాపారులైతే లాభాల కోసం ఆహార పదార్థాలను కూడా కల్తీ చేసి లాభాలను పొందుతున్నారు. అటువంటి ఆహార పదార్థాలలో పన్నీర్ ఒకటి. పన్నీర్ ని ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఇది రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు ని కలిగిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో రసాయనాలతో తయారు చేసిన పన్నీర్ నీ మార్కెట్లలో విపరీతంగా అమ్ముతున్నారు. ఇక మీరు కొనుగోలు చేసిన పన్నీర్ పాలతో తయారు చేసిందా లేదా నకిలీదా అని మీరు ఇంట్లోనే సులభంగా నిర్ధారణ తెలుసుకోవచ్చు. మరి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Paneer పన్నీర్ అసలైందేనా లేదా నకిలీదా వంటింటి చిట్కాలతో తెలుసుకోండిలా

Paneer : పన్నీర్ అసలైందేనా లేదా నకిలీదా… వంటింటి చిట్కాలతో తెలుసుకోండిలా..!

ముందుగా మార్కెట్లో కొనుగోలు చేసిన పన్నీరును ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. దీనిని చేతులతో నలపడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పన్నీర్ మెత్తగా ఉంటుంది కాబట్టి దీనిని చేతులతో నలిపితే అది పొడిగా మారుతుంది. అదే నకిలీ పన్నీర్ నీ సింథటిక్ రసాయనల తో తయారుచేస్తారు కనుక ఇది గట్టిగా ఉంటుంది. అంతేకాకుండా నకిలీ పన్నీరు లబ్బరుల ఉండి ఎంత నలిపిన నలగకుండా బంతిలా ఎగురుతుంది. ఇక ఇలా ఉన్నట్లయితే అది నకిలీదని నిర్ధారించవచ్చు. అదేవిధంగా పన్నీర్ రంగుతో కూడా నకిలీదా లేదా అసలైన తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే స్వచ్ఛమైన పన్నీర్ లేత తెలుపు రంగులో ఉంటుంది. అదే నకిలీ పన్నీర్ సింథటిక్ తో తయారు చేసిన తెల్లగా ఉంటుంది. కాబట్టి తెల్లగా ఉండే పన్నీర్ నకిలీదని వెంటనే గుర్తించవచ్చు. అంతేకాకుండా ఒక తెల్లటి కాగితంపై పన్నీరుని రుద్దితే అది రంగు మారితే అది నకిలీ పన్నీర్ అని సులభంగా చెప్పవచ్చు.

అలాగే అయోడిన్ పరీక్షలు కూడా చేయవచ్చు. అది ఎలా అంటే ముందుగా కొంత పన్నీర్ భాగాన్ని తీసుకొని నీటిలో ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించిన పన్నీర్ ని ఒక ప్లేట్ లో ఉంచి చల్లారనివ్వాలి. దీని మీద రెండు చుక్కల అయోడిన్ టింక్చర్ వెయ్యాలి. కొంతసేపటికి పన్నీర్ నీలం రంగులోకి మారిపోతే అది నకిలీదని అర్థం. ఇక పన్నీర్ వాసనని బట్టి కూడా స్వచ్ఛమైన పన్నీర్ ను గుర్తించవచ్చు. పాలతో చేసినటువంటి పన్నీర్ పెరుగు లేదా పుల్లని వాసన వస్తుంది అదే సింథటిక్ పన్నీర్ లో కృతిమ రసాయన వాసన వస్తుంది.

మార్కెట్లలో పన్నీర్ కొనే ముందు ప్యాకేజింగ్ శ్రద్ధగా పరిశీలించండి. స్వచ్ఛమైన పన్నీర్ ఘన రూపంలో ఉంటుంది. అదే నకిలీ పన్నీర్ ముక్కలు గా ఉంటుంది. ఇక నకిలీ పన్నీరుని తనిఖీ చేయడానికి ఒక గిన్నెలో పన్నీర్ ముక్కలు మరియు నీళ్లు పోసి మరిగించాలి. ఇలా మరుగుతున్న సమయంలో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ సమయంలో పన్నీర్ లేత ఎరుపు రంగులోకి మారిపోయినట్లయితే అందులో డిటర్జెంట్ యూరియా కలిపారని అర్థం. అదేవిధంగా ఒక పన్నీర్ ముక్కను పెనం మీద వేయించితే అది గోధుమ రంగులోకి మారుతే స్వచ్ఛమైన పన్నీర్ అని అర్థం . ఒకవేళ నకిలీ పన్నీర్ అయితే కరిగి నీటిని విడుదల చేయడమే కాకుండా జిడ్డుగా ఉంటుంది

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది