Paneer Side Effects : రాత్రిపూట పన్నీర్ తింటే ఏమవుతుందో తెలిస్తే.. అస్సలు తినరు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Paneer Side Effects : రాత్రిపూట పన్నీర్ తింటే ఏమవుతుందో తెలిస్తే.. అస్సలు తినరు..!

 Authored By jyothi | The Telugu News | Updated on :13 January 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Paneer Side Effects : రాత్రిపూట పన్నీర్ తింటే ఏమవుతుందో తెలిస్తే.. అస్సలు తినరు...!

Paneer Side Effects : మన భారతీయ వంటకాల్లో పన్నీర్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ పన్నీరు ఇష్టపడని వారంటూ ఉండరు. ఈ పన్నీర్లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ నాన్ వెజ్ తినే వారికి చికెన్ ఎలాగ వెజిటేరియన్ కి ఈ పన్నీర్ ఆలాగా. దీనిని గ్రేవీ గా సలాడ్లలో పిజ్జా ఇలా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే వీటి వాడకం గురించి ఒక పెద్ద లిస్టే ఉంది. అయితే పన్నీర్ తీసుకుంటే అంతే చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది. అయితే ఈ పన్నీర్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే డైరీ ప్రొడక్ట్స్ అంటే ఎలర్జీ ఉన్నవారు మాత్రం ఈ పన్నీర్ ను చాలా తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. పన్నీర్ ఇది శరీరానికి ప్రోటీన్లు పుష్కలంగా అందిస్తుంది. పన్నీరు తింటుంటే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ రాత్రిపూట పన్నీరు తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. రాత్రిపూట పన్నీర్ తింటే అజీర్తి సమస్య తలెత్తుతుంది. కొంతమంది కడుపు ఉబ్బరం సమస్యతో కూడా బాధపడవచ్చు.

రాత్రి సమయంలో పన్నీరు తింటే రక్తపోటును కలిగిస్తుంది. ఫలితంగా గుండె సమస్యలకు కూడా దారితీస్తుంది. పన్నీర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది. ఇది పాల ఉత్పత్తి అయినందున మొటిమలను ప్రేరేపిస్తుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య కూడా వస్తుంది. కాబట్టి రాత్రి పూట పన్నీరు తీసుకోకుండా ఉంటేనే మంచిది. అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఊబకాయంతో బాధపడేవారు, గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడేవారు, అలర్జీ లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు పన్నీర్ని ఎక్కువగా తీసుకోవద్దు. మితంగా మాత్రమే తీసుకోవాలి. అధికంగా తీసుకున్నట్లయితే ఈ సమస్యలు తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది