Health Benefits : బొప్పాయి ఆకు రసం వల్ల ఎన్ని లాభాలో.. కచ్చితంగా తాగాల్సిందే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : బొప్పాయి ఆకు రసం వల్ల ఎన్ని లాభాలో.. కచ్చితంగా తాగాల్సిందే!

Health Benefits : బొప్పాయిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి పండును, విత్తనాలు, ఆకులను వివిధ రకాల ఔషధ తయారీల్లో విస్తృతంగా వాడతారు. టీలు, పదార్థాలు, మాత్రలు మరియు బొప్పాయి ఆకు రసాలు వంటివి ఉపయోగిస్తారు. బొప్పాయి ఆకు పదార్థాలు తరచుగా అనారోగ్యాలకు చికిత్స చేయడానికి మరియు ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు.డెంగ్యూ అనేది దోమ ద్వారా సంక్రమించే వైరస్. డెంగ్యూ వచ్చినప్పుడు జ్వరం, అలసట, తల నొప్పి, వికారం, వాంతులు మరియు చర్మ […]

 Authored By pavan | The Telugu News | Updated on :7 April 2022,2:00 pm

Health Benefits : బొప్పాయిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి పండును, విత్తనాలు, ఆకులను వివిధ రకాల ఔషధ తయారీల్లో విస్తృతంగా వాడతారు. టీలు, పదార్థాలు, మాత్రలు మరియు బొప్పాయి ఆకు రసాలు వంటివి ఉపయోగిస్తారు. బొప్పాయి ఆకు పదార్థాలు తరచుగా అనారోగ్యాలకు చికిత్స చేయడానికి మరియు ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు.డెంగ్యూ అనేది దోమ ద్వారా సంక్రమించే వైరస్. డెంగ్యూ వచ్చినప్పుడు జ్వరం, అలసట, తల నొప్పి, వికారం, వాంతులు మరియు చర్మ దద్దుర్లు వంటి ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. బొప్పాయి ఆకు సారం డెంగ్యూ జ్వరం ఉన్న వారిలో రక్త ప్లేట్లెట్ స్థాయిలను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు శరీరంలో ప్లేట్లెట్లు సంఖ్య దారుణంగా పడి పోతుంది.

ఒక్కో సారి ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. లక్షల్లో ఉండాల్సిన పేట్లెట్ల సంఖ్య 20 లేదా 30 వేలకు పడిపోతుంది. ఇలాంటి సమయంలో బయటి వ్యక్తుల నుండి సేకరించిన రక్తంలో నుండి ప్లేట్లెట్లను వేరు చేసి రోగికి ఎక్కించాల్సిన పరిస్తితి ఏర్పడుతుంది. అలా ఒకటి రెండు సార్లు ఎక్కించిన తర్వాత ప్లేట్లెట్ల సంఖ్య కాస్త మెరుగవుతుంది. ఇలాంటి వారికి బొప్పాయి నిజమైన అమృతంలా పని చేస్తుంది. బొప్పాయి ఆకులతో చేసిన రసాన్ని రోగులు తాగితే వారి శరీరంలో రక్తం యొక్క ప్లెట్లెట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. తిరిగి మాములు స్థితికి వచ్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.బొప్పాయితో ఇంకా చాలా ప్రయోజనాలే ఉన్నాయి. బొప్పాయి ఆకును డయాబెటిస్ మరియు అధిక రక్తంలో చక్కెర స్థాయిలకు చికిత్స చేయడానికి సాంప్రదాయ వైద్య పద్ధతుల్లో ఉపయోగిస్తారు.

papaya leaf juice Health benefits

papaya leaf juice Health benefits

బొప్పాయి ఆకు రక్తంలో చక్కెరను తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. బొప్పాయి ఆకులోని పోషకాలు మరియు సమ్మేళనాలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుందది. బొప్పాయి ఆకు తరచుగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి మరియు జుట్టు ఆరోగ్యానికి మద్దతుగా ఉపయోగిస్తారు. బొప్పాయి ఆకులతో చేసిన రసాన్ని జుట్టు కుదుళ్ల నుండి కొనల వరకు మంచిగా పట్టించాలి. ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టు లోపలికి వెళ్లి.. జుట్టు దృడంగా తయారవుతుంది. చిట్లపోయి ఉన్నట్లు కనిపించే జుట్టును ఈ బొప్పాయి రసం నయం చేస్తుంది. తరచూ ఇలా రసాన్ని జుట్టుకు పట్టిస్తే గుర్తించదగ్గ రీతిలో ప్రయోజనం కనిపిస్తుంది. జుట్టు పట్టు కుచ్చులా నిగనిగ లాడుతుంది. బొప్పాయి ఆకులోని ఎంజైమ్లు చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి, మొటిమలను నివారించడానికి మరియు మచ్చలు కనిపించడాన్ని తగ్గించడానికి ఎక్స్ఫలియంట్గా పనిచేస్తాయి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది