Paralysis Symptoms : పక్షవాతం వస్తుందని చెప్పే ఆ మూడు లక్షణాలు ఏంటో మీకు తెలుసా?
Paralysis Symptoms : పక్షవాతం… ఈ పేరు వింటేనే చాలా మంది భయపడిపోతుంటారు. ఎందుకంటే ఇది మొండి జబ్బు. వస్తే తగ్గడం చాలా కష్టం. అంతే కాకుండా బతికినన్ని రోజులు మంచానికే పరిమితం కావాల్సి వస్తుంది. అందుకే ఈ జబ్బు పేరు వింటనే అందరూ గజగజా వణికిపోతారు. పక్షవాతం గనక వస్తే మనిషి తన సహజంగా చేసుకునే పనులు కూడా చేసుకోలేని పరిస్థితి వస్తుంది. దీని నుంచి 20 శాతం మందే కోలుకుంటారు. మిగిలిన వారందరూ జీవితాంతం ఈ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. అయితే పక్షవాతం చెప్పి రాదు. నిమిషం అర నిమిషంలోనే కాలు చేయి పడిపోయి.. నోట మాట రాకుండా పోతుంది. అయితే ఈ జబ్బు రావడానికి ముఖ్యంగా మూడు కరణాలు ఉన్నాయి.
అయితే పక్షవాతం రాకుండా ఉండాలంటే ముందుగా వచ్చే ఆ లక్షణాలపై దృష్టి పెట్టాలి. అయితే ఆ లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.గతంలో పక్షవాతం వృద్ధులకు మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు పట్టుమని 15 ఏళ్లు కూడా నిండని పిల్లల నుంచే వచ్చేస్తుంది. దీనికి కారణం మన జీవన శైలిలో వచ్చే ఈ మూడు మార్పులే. ముందుగా ఉప్పును ఎక్కువగా తినడం వల్ల చాలా ప్రమాదం ఉంటుంది. ఉప్పుకు రక్తాన్ని చిక్క పరిచే గుణం ఉంటుంది. బిపి రావడానికి కూడా సాల్ట్ కారణమవుతుంది. సాధారణంగా చూస్తే ఏ దేశాలు సాల్ట్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారో.. ఆ దేశాల్లోనే పెరాలసిస్ రోగులు ఎక్కువగా ఉన్ట్లు చెబుతున్నారు. అయితే మనం రోజులో కేవలం 1.5 గ్రాముల ఉప్పును మాత్రమే వినియోగించాలి.
అంతకు మించి తీసుకుంటే చాలా ప్రమాదం.రెండవది తెల్లటి పదార్థాలు. అంటే మైదా పిండితో తయారు చేసే ఆహార పదార్థాలు. వీటిలో కార్బోహైడ్రేట్లు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి త్వరగా జీర్ణమయ్యి కొవ్వుగా మారతాయి. తర్వాత ఎల్.డి.ఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ గా మారతాయి. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ వలన రక్త నాళాలు కూడుకుపోతాయి. దీని ద్వారా రక్త ప్రసరణ జరగక పెరాలసిస్ వచ్చే ఆకాశం ఎక్కువ అవుతుంది. మూడోది హైబీపి. హైబీపీ వచ్చిన వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మూడింటిని నియంత్రణలో ఉంచుకుంటే పెరాలసిస్ ముప్ప నుంచి తప్పించుకోవచ్చు.