Diabetes : డయాబెటిస్ టైప్ 2 ఉన్నవారికి కంటి చూపు దెబ్బతినే ప్రమాదం… గ్లూకోమా వచ్చే అవకాశం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : డయాబెటిస్ టైప్ 2 ఉన్నవారికి కంటి చూపు దెబ్బతినే ప్రమాదం… గ్లూకోమా వచ్చే అవకాశం…

Diabetes : మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజుకి ఎక్కువవుతుంది. ఈ మధుమేహం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. వాటిలో ముఖ్యంగా కళ్ళకు ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అంటే 40 సంవత్సరాల తర్వాత వయసు గల వారు 11.2 మిలియన్ల మంది గ్లూకోమా అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ సమాచారం మనకు అందించారు. దీని నేపథ్యంలో చూసుకున్నట్లయితే భారతదేశంలో 64.8 లక్షల […]

 Authored By aruna | The Telugu News | Updated on :21 August 2022,7:30 am

Diabetes : మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజుకి ఎక్కువవుతుంది. ఈ మధుమేహం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. వాటిలో ముఖ్యంగా కళ్ళకు ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అంటే 40 సంవత్సరాల తర్వాత వయసు గల వారు 11.2 మిలియన్ల మంది గ్లూకోమా అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ సమాచారం మనకు అందించారు. దీని నేపథ్యంలో చూసుకున్నట్లయితే భారతదేశంలో 64.8 లక్షల మందికి ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లూకోమా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గ్లూకోమా అధిక ఎండో క్రైన్ అధిక స్ట్రెస్ తో వస్తుందంటున్నారు. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2.76 కోట్ల మంది కి ఇలాంటి విధమైన ప్రైమరీ యాంగిల్ క్లోజర్ వ్యాధి చుట్టుముట్టవచ్చు అని చెప్తున్నారు.

నోయిడాలోని ఫోర్టీస్ దావఖానలో కంటి చికిత్స హెచ్ ఓ డి, సీనియర్ డాక్టర్ నీతూ శర్మ టీవీ 9 వాళ్ళతో ప్రసంగిస్తూ గ్లూకోమా అనే వ్యాధి కంటి ఆఫ్టేక్ నరాలను దెబ్బతీస్తుంది. అలాగే నేత్రం ముందు భాగంలో ద్రవం పేరుకుపోయినప్పుడు, ఇది వస్తుంది. ఈ అధిక ద్రవం ద్వారా ఆ వ్యక్తికి కంట్లో ఒత్తిడి అధికంగా జరుగుతుంది. నరాల ఫైబర్స్ డ్రై అయిపోతాయి. అని డాక్టర్ నీతూ తెలియజేశారు. ఇలాంటి ఒత్తిడిని ఇంట్రా కోక్యులర్ ఒత్తిడి అని పిలుస్తారు. ఇది మెదడుకు చిత్రాలను చేరవేసే ఆప్టిక్ నరాలకు ప్రమాదం కలిగించవచ్చు. ఈ వ్యాధి జీన్స్ పరంగా కూడా వ్యాపిస్తుంది. అలాగే సహజంగా పెద్ద వయసు గల వారికి కనిపిస్తుంది.
ఓపెన్ యాంగిల్ గ్లూకోమా సహజంగా 40 సంవత్సరాల తర్వాత వారికి సంభవిస్తుంది.

People with type 2 diabetes are at increased risk of developing glaucoma

People with type 2 diabetes are at increased risk of developing glaucoma

ఇప్పుడు ఈ వ్యాధి చిన్నపిల్లల్లోను కూడా వస్తుంది. అలాగే పుట్టుకతో కూడా ఈ వ్యాధి ఉంటుంది. అలాగే ఇది నవజాత శిశువుని కూడా ప్రభావితం చేస్తుంది. మధుమేహం టైప్ 1 లేదా టైప్ 2 తో ఇబ్బంది పడే వారికి ఈ గ్లూకోమాను వ్యాపిస్తుంది. మధుమేహ బాధితులలో ఓపెన్ యాంగిల్ గ్లూకోమా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. డయాబెటిస్ ఉన్న వ్యక్తికి అతనికి కంటిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక విషయం తెలియజేయాలంటే మధుమేహం బాధితులలో గ్లూకోమా కేసులు చాలా అధిక సంఖ్యలో ఉన్నాయి. ఈ వ్యాధితో బాధపడేవారు దృష్టి కోల్పోవచ్చు. అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది