Pippalu : పిప్పళ్ళు లలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో తెలుసా..?
Pippalu : పిప్పళ్ళు అంటే చాలామందికి తెలియదు.. కానీ పూర్వకాలంలో ఈ పిప్పళ్ళను బాగా వినియోగించేవారు. ఈ పిప్పళ్ళలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.. ఈ పిప్పళ్ళు ఎలాంటి రోగాన్ని అయినా ఇట్టే నయం చేసే గుణం వీటిలో ఉంటుంది.. బాన పొట్ట బొజ్జ తగ్గాలంటే బరువు తగ్గాలంటే పిప్పళ్ళు మెరుగ్గా పనిచేస్తాయి. పిప్పళ్ళు పొడిని తేనెతో కలుపుకుని ఉదయం రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకుంటే బాన పొట్ట ఇట్టే కరిగిపోతుంది. అధిక బరువు సమస్య […]
ప్రధానాంశాలు:
Pippalu : పిప్పళ్ళు లలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో తెలుసా..?
Pippalu : పిప్పళ్ళు అంటే చాలామందికి తెలియదు.. కానీ పూర్వకాలంలో ఈ పిప్పళ్ళను బాగా వినియోగించేవారు. ఈ పిప్పళ్ళలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.. ఈ పిప్పళ్ళు ఎలాంటి రోగాన్ని అయినా ఇట్టే నయం చేసే గుణం వీటిలో ఉంటుంది.. బాన పొట్ట బొజ్జ తగ్గాలంటే బరువు తగ్గాలంటే పిప్పళ్ళు మెరుగ్గా పనిచేస్తాయి. పిప్పళ్ళు పొడిని తేనెతో కలుపుకుని ఉదయం రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకుంటే బాన పొట్ట ఇట్టే కరిగిపోతుంది. అధిక బరువు సమస్య ఉండదు. అలాగే బరువు సులభంగా తగ్గుతారు. పిప్పళ్ళ పొడిని కషాయంలా తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. వాపులు తగ్గిపోతాయి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పిప్పళ్ళు స్త్రీల గర్భాశయ వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. బాలింతలు పిప్పలు తింటే శిశువుల్లో శారీరక ఎదుగుదల బాగుంటుంది. పిల్లలతో బుద్ధిని వికసింపజేసి మేధాశక్తి పెరిగేలా పిప్పళ్ళు దోహదపడతాయి. శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. మైగ్రేన్ అనే తీవ్రమైన తలనొప్పికి దివ్య ఔషధంలా పనిచేయడమే కాక గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. మూత్రపిండాల వ్యాధులు తగ్గడానికి తోడ్పడతాయి. వేయించి పొడిచేసి సైంధవ లవణం కలిపి అన్నంలో తీసుకుంటే స్థూలకాయాన్ని నివారించవచ్చు..
బాలింతరానికి చనుబాలు వృద్ధి చెందాలంటే పిప్పలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. ఈ చలికాలంలో పిప్పళ్ళు తీసుకుంటే శ్వాసనాలం శుభ్రం అవుతుంది. దాని వలన సులభంగా శ్వాస తీసుకోవడానికి వీలుంటుంది. ఈ పిప్పళ్లు ను ఆయుర్వేదంలో కూడా బాగా వినియోగిస్తారు.. వీటిని తీసుకుంటే మలబద్ధకం, అజీర్తి సమస్యలకు చెక్ పెట్టినట్లే.. దీనిలోని కార్మినెటిక్ లక్షణాలు ఉబ్బరం, గ్యాస్ తగ్గించటానికి ఉపయోగపడతాయి…