Psychology : మీరు ఇతరులను నమ్మి మోసపోతున్నారా… మరి వారిని ఎలా పసిగట్టాలి… ఎలా జాగ్రత్త పడాలి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Psychology : మీరు ఇతరులను నమ్మి మోసపోతున్నారా… మరి వారిని ఎలా పసిగట్టాలి… ఎలా జాగ్రత్త పడాలి…?

 Authored By ramu | The Telugu News | Updated on :20 February 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Psychology : మీరు ఇతరులను నమ్మి మోసపోతున్నారా... మరి వారిని ఎలా పసిగట్టాలి... ఎలా జాగ్రత్త పడాలి...?

Psychology : సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారి భావోద్వేగాలు తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మి మోసపోతుంటారు. ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్య నమ్మకం ఒక పునాదిలా ఉండాలి. కానీ అది లేనిచో ఎదుటివారీ పసిగట్టలేం. ఎందుకంటే ఎదుటివారు మోసం చేసేవారు అయితే, చాప కింద నీరులా ఉంటారు. అంత సైలెంట్ గా వారు చేసేవి చేసుకుంటూ వెళ్తారు. అది మనం గమనించo. తీరా అంతా జరిగాక. ఎవరినైతే నమ్మకంతో బలంగా నమ్మామో, చివరికి వారి గుట్టు బయటపడుతుంది. ఇంతలో మనం నిండా మునిగిపోతాం. తరువాత చేసేది ఏమీ లేదు. నిరుత్సాహంతో బాధతో కృంగిపోతాం. కాబట్టి ఎదుటివారిని నమ్మేముందు ఒకటికి పది సార్లు ఆలోచించి స్నేహం చేయడం మంచిది. వారిని పూర్తిగా అబ్జర్వేషన్ చేయాలి. ఆ తర్వాతే వారిని నమ్మాలి. ఎందుకంటే, మనం సంపాదించే సంపాదన పోగొట్టుకోవాలంటే క్షణం కూడా పట్టదు. కానీ సంపాదించడానికి చాలా కష్టపడాలి. అటువంటి సంపాదనను ఒకరిని నమ్మి క్షణంలో పోగొట్టుకుంటాo. స్నేహం విషయంలో కూడా చాలా నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఇద్దరి స్నేహితుల మధ్యన ఉండాలి. ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే ఉంటే నమ్మకద్రోహం తప్పదు. మన చుట్టూ ఉన్న వారందరితో స్నేహం చేయాలి అంటే నమ్మకం పునాది లాంటిది. ఈ నమ్మకం అనేది స్నేహితుల మధ్యన లేకపోతే క్షణాల్లో, నిమిషాల్లో విడిపోతారు.

Psychology మీరు ఇతరులను నమ్మి మోసపోతున్నారా మరి వారిని ఎలా పసిగట్టాలి ఎలా జాగ్రత్త పడాలి

Psychology : మీరు ఇతరులను నమ్మి మోసపోతున్నారా… మరి వారిని ఎలా పసిగట్టాలి… ఎలా జాగ్రత్త పడాలి…?

ఎవరైనా సరే నమ్మకం అనే పునాది వేసుకోవాల్సిందే. ఇద్దరి స్నేహితుల మధ్య అయిన,ఇద్దరి భార్య భర్తలు మధ్య అయిన ఎవరి మధ్యనైనా సరే నమ్మకం అనే పునాది ఉండాలి. ఇది లేనిచో నమ్మకం సన్నగిల్లితే వెయ్యల బంధం అయినా సరే క్షణాల్లో తెగిపోతుంది. అది ప్రేమ అయినా స్నేహమైనా… ఏ విషయంలోనైనా బంధం బలపడాలి అంటే నమ్మకం ఉండాలి. నమ్మకం బంధానికి పునాది. ఈ రోజుల్లో ఒక మనిషి పట్ల నమ్మకం సంపాదించుకోవాలంటే చాలా కష్టంగా మారిపోయింది. అయితే ఒక్కసారి ఆ నమ్మకం ఏర్పడితే, ఆ నమ్మకం బంధం కలకాలం నిలబెట్టుకుంటుంది. మనం ప్రాణం కంటే ఎక్కువ నమ్మిన వ్యక్తి, నన్ను మోసం చేస్తున్నారు అని తెలిస్తే, వారు ఏం చేసినా మనకు మోసంగానే కనిపిస్తుంది. వంటి యొక్క అనుభవం ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురై ఉంటుంది. ఒకసారి నమ్మకం కుదిరాక, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, ఒక్కసారి నమ్మిన వ్యక్తి మోసం చేస్తే, నమ్మకం ఎప్పటికీ తిరిగి రాదు. మోసం చేసిన సంఘటన బలంగా మనసులో ముద్రించబడుతుంది. శాశ్వతంగా విడిపోయే ప్రమాదం ఉంది. అటువంటి వ్యక్తి పై మళ్లీ నమ్మకం ఏర్పడేయాలి అంటే చాలా కష్టం. మీరు ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మేముందు, వారిలో ఈ కింది లక్షణాలు ఉన్నాయో లేవో సరిగ్గా గమనించండి. అని చాణిక్యుడు తన నవలలలో ఇలా తెలియజేశాడు…..

Psychology ప్రశాంతంగా, గంభీరంగా ఉండే గుణం

ప్రతి ఒక్కరి జీవితంలో మంచి లక్షణాలు మరియు చెడు లక్షణాలు ఉంటాయి. మంచివారిని మరియు చెడ్డ వారిని గుర్తించడం ఎలా… అయితే సోమరితనం, గొప్పలు చెప్పుకునే వారిని, పదేపదే అబద్ధం చెప్పే అలవాటు ఉన్న వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ నమ్మవద్దు. ప్రశాంతంగా గంభీరంగా నిజాయితీగా మాట్లాడే వారిని,ధర్మ మార్గంలో నడిచే వారిని,మాత్రమే విశ్వసించాలని చానిక్యుడు చెబుతున్నాడు.

Psychology త్యాగం చేసే లక్షణం

ఒక వ్యక్తిని నమ్మే ముందు వారిలో త్యాగం చేసే గుణం ఉందో లేదో ఎలా చూడాలి.. ఇతరుల జీవితాల్లో ఆనందాన్ని నింపుట కొరకు వారు తమ సొంత ఆనందాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతారు. అటువంటి వ్యక్తులు ఇతరుల బాధలను అర్థం చేసుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులను గుడ్డిగా ఎన్నాళ్ళైనా నమ్మవచ్చు.

Psychology వారి కుటుంబంలో వారి పాత్ర ఎలా ఉంటుంది

మీరు ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మేముందు, ఆ వ్యక్తి యొక్క కుటుంబంలో వారి పాత్ర ఏ స్థానంలో ఉందో తెలుసుకోవడం ముఖ్యం. ఆ వ్యక్తి తన ఇంట్లో వారిని ఎలా చూసుకుంటున్నాడు, అతని ఇంట్లో వారి పాత్ర ఏమిటి, ఆరు మంచి పనులు చేస్తారా లేదా చెడు పనులు చేస్తారా, విషయాలపై దృష్టి పెట్టి తప్పక తెలుసుకోవాలి. అప్పుడే వారిని మనం నమ్మాలో నమ్మకూడదు నిర్ణయించుకోవచ్చు.

Psychology వారికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చి చూడండి

కొంతమందికి, సంబంధాల కంటే డబ్బు విలువైనదిగా భావిస్తారు. ఎవరైనా నమ్మకమైన వారో…కాదో తెలుసుకోవడానికి వారికి డబ్బు ఇవ్వడం ద్వారా అయితే తెలుసుకోవచ్చు.. మీరు ఎవరినైతే నమ్మరు వారికి కొంత డబ్బు ఇచ్చి చూడండి. వారు ఆ డబ్బును మీరు అనుకున్న సమయానికి తిరిగి ఇస్తే.. మీరు వారిని పూర్తిగా నమ్మవచ్చు. అలాంటి వారు నమ్మకానికి కట్టుబడి ఉంటారు. అయితే కొంతమంది స్వార్థపూరిత ఆలోచనలతో. తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తుంటారు. వారిని ఎప్పటికీ నమ్మదగిన వారు కాలేరు. మీరు చాప కింద నీరులా మోసం చేస్తారు. వీరి మోసం చివరి వరకు తెలియదు. నిండా మునిగిన తరువాత వీరి విశ్వరూపం బయటపడుతుంది. వీరితో స్నేహం అన్ని అబద్ధాలతో నిండి ఉంటుంది. డబ్బు తిరిగి ఇస్తా అన్న సమయానికి తిరిగి ఇవ్వలేక. అప్పుడు ఇప్పుడు అనే మాట దాటేస్తూ కాలం గడుపుతారు. ఇలాంటి వారి నుంచి మీరు ఇచ్చిన డబ్బు ఎన్నటికి తిరిగి రాదు. సమయానికి ఇవ్వని చెవు వారి పట్ల నమ్మకం పూర్తిగా పోతుంది. మన వెనుక కుట్రలు పండుతారు. మొదట ఉన్న స్నేహం తరువాత శత్రువులా మారిపోతారు. మనల్ని మోసం చేస్తూ ఉంటారు. స్నేహంతో మొదలై తరువాత శత్రువుగా మారుతారు. మీరు అవసరానికి తగ్గట్లు ఊసరవెల్లిలా మారుతుంటారు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకద్రోహం చేసే వారికి ఎప్పటికీ దూరంగా ఉండాలి. సరానికి వాడుకుని తరువాత దూరం పెట్టే వారిని ఎప్పటికీ నమ్మకూడదు. అని చాణిక్య నీతి కథలలో చెప్పబడినది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది