Raw Vegetables : ఈ కూరగాయలను పచ్చిగా తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raw Vegetables : ఈ కూరగాయలను పచ్చిగా తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

 Authored By aruna | The Telugu News | Updated on :23 January 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Raw Vegetables : ఈ కూరగాయలను పచ్చిగా తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

Raw Vegetables : చాలామంది ఆరోగ్యంగా ఉండడం కోసం.. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా పచ్చి కూరగాయలను తింటూ ఉంటారు. అయితే కొన్ని పచ్చి కూరగాయలను తినడం వలన కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… వంకాయను పచ్చిగా అస్సలు తినకూడదు. ఎందుకంటే వంకాయలో సొలనైన్ అనే సమ్మేళన ఉంటుంది. ఇది శరీరంలో విషాలను విడుదల చేస్తుంది. వంకాయలను ఉడికించేటప్పుడు సులనైన్ అనే సమ్మేళనం ప్రభావం తగ్గుతుంది. కాబట్టి వంకాయలు పచ్చిగా తినకుండా ఓ మోతాదులు ఉడికించి తీసుకోవచ్చు. కాలిఫ్లవర్ ని కూడా పచ్చగా తినకూడదు. ఉడికించుకుని మాత్రమే తినాలి.

ఎందుకంటే కాలీఫ్లవర్ ఉడికిస్తే వాటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎక్కువగా అందుతాయి. పచ్చిగా తిన్నప్పుడు జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మొలకెత్తిన గింజలను తినడం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైంది. వీటిని ఉడికించి తింటే మంచిది. ఎందుకంటే వీటిలో ఉండే రసాయనాలు జీర్ణ సంబంధ సమస్యలు వచ్చేలా ప్రేరేపిస్తాయి. మొలకెత్తిన గింజలను పచ్చిగా తిన్నప్పుడు గ్యాస్ వంటి సమస్యలు వస్తే తినడం మానేయాలి. అప్పుడు ఉడికించి మాత్రమే తీసుకోవాలి. మనలో చాలామంది పుట్టగొడుగులను పచ్చిగా తింటుంటారు. వాటిలో ఉండే విష పదార్థాలు ప్రమాదకర పరిస్థితులను కలిగిస్తూ ఉంటాయి. అందువల్ల ఉడికించి మాత్రమే తినాలి.

బంగాళాదుంపని కూడా తప్పనిసరిగా ఉడికించుకునే మాత్రమే తినాలి. ఎందుకంటే పచ్చగా తింటే వాటిలో ఉండే పిండి పదార్థాలు త్వరగా జీర్ణం కాక గ్యాస్ అసిడిటీ వంటి జీర్ణ సంబంధి సమస్యలు వస్తాయి.కాబట్టి ఇప్పుడు చెప్పిన కూరగాయలను కచ్చితంగా ఉడికించుకుని మాత్రమే తినాలి. పచ్చిగా తింటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు… ప్రస్తుతం మన ఉన్న కాలంలో కూరగాయలకి పెస్టిసైడ్స్ ఎక్కువగా స్ప్రే చేస్తున్నారు. దానివలన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కావున ప్రతికూరగాయను కూడా సరైన పద్ధతిలో ఉడికించుకుని తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది