Red Green Leafy : ఎర్ర బచ్చల ఆకు కూర కాదు దివ్య ఔషధం.. తప్పకుండా తినాల్సిందే…!
ప్రధానాంశాలు:
Red Green Leafy : ఎర్ర బచ్చల ఆకు కూర కాదు దివ్య ఔషధం.. తప్పకుండా తినాల్సిందే...!
Red Green Leafy : నేటి కాలంలో బయట ఆహారపు అలవాట్లు కారణంగా చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఆ బరువును తగ్గించుకోవడం కోసం అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కొంతమంది డైటింగ్ చేస్తూ మరి కొంతమంది వ్యాయామం వంటివి చేస్తూ బరువు తగ్గాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే సులభంగా బరువు తగ్గడానికి దివ్య ఔషధమైన ఎర్ర బచ్చల ఆకుకూర చాలామందికి తెలియకపోవచ్చు. ఇందులో అనేక పోషకాహారాలు ఎన్నో ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. దీని ఆకు నుండి కాండం వరకు అన్ని ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయి. కూర ఆకులు మరియు కాండం అంతా కూడా ఎర్రటి ద్రవ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే ఆఫ్రికన్ సాంప్రదాయా వైద్యంలో గ్యాస్టిక్ సమస్యలకు ఎర్ర బచ్చలి కూర నీ ఉపయోగిస్తారు.
సులభంగా బరువు తగ్గాలి అనుకునేవారు ప్రతిరోజు పాలకూరను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఎందుకంటే ఎర్ర బచ్చలి కూరలు ప్రోటీన్లు పుష్కలంగా లభించడంతో దీనిని తిన్న తరువాత కూడా ఎక్కువసేపు ఆకలిగా ఉండదు. అంతేకాకుండా బచ్చలి కూర తినడం వలన ఒత్తిడి మరియు గుండె జబ్బు సమస్యలు దూరమవుతాయి.అదేవిధంగా ఎర్ర బచ్చలి కూరలో ఉండే ప్రోటీన్ రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. బచ్చల కూరలో ఉండే ప్రోటీన్ ఒక రకమైన హార్మోన్ ను విడుదల చేయగా ఇది ఆకలి మరియు బరువు పెరగడాన్ని నియంత్రణలో ఉంచుతుంది.
జీర్ణక్రియ వంటి సమస్యలు ఉన్నవారు తరచు ఎర్ర పాలకుర ను తినడం వలన సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఇందులో వివిధ రకాల విటమిన్లు ఉంటాయి.ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే పెద్ద ప్రేగును శుభ్రపరిచి ఫైబర్ పేగు కదలికల ప్రక్రియను సులభం చేస్తుంది. దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యలు తోలగిపోతాయి.