Rose Water : రోజ్ వాటర్ తో చర్మ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు… ఎలాగో తెలుసా…!!
ప్రధానాంశాలు:
Rose Water : రోజ్ వాటర్ తో చర్మ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు... ఎలాగో తెలుసా...!!
Rose Water : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క అమ్మాయి కూడా అందంగా కనిపించాలి అనుకుంటుంది. దీనికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంది. అయితే మన చర్మ సౌందర్యానికి ఎంతో సున్నితమైన గులాబీ రేకుల నుండి తయారుచేసిన రోజ్ వాటర్ మ్యాజిక్ లా పనిచేస్తుంది. అలాగే మన చర్మాన్ని హైడ్రేట్ చేయటం లో కూడా రోజ్ వాటర్ ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే చర్మంపై మంట మరియు చికాకు అనేవి ఈ రోజ్ వాటర్ వలన ఈజీగా తగ్గుతాయి అని నిపుణులు అంటున్నారు. అంతేకాక మణికట్టు మరియు చంకల లో కూడా ఈ రోజ్ వాటర్ ను రాస్తే దుర్వాసన అనేది తగ్గిపోతుంది అని అంటున్నారు. అయితే ఈ రోజ్ వాటర్ ముఖానికి అప్లై చేసుకోవటం వలన ముఖంపై ఉండే దుమ్ము మరియు ధూళి క్లీన్ అవుతాయి. దీంతో మీ ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. ఇది చర్మం సహజ pH స్థాయిలను సమతుల్యం చేయటంలో కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే చర్మం పొడి బారడం మరియు జిడ్డును కూడా తగ్గిస్తుంది…
ఈ రోజ్ వాటర్ ను వారానికి రెండుసార్లు వాడితే ఎప్పటికప్పుడు వచ్చే ఎక్కువ సైబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది అని వైద్యు నిపుణులు అంటున్నారు. అలాగే చర్మం ఎరుపు మరియు తామర, చర్మ శోథ లాంటి చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా రోజ్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజ్ వాటర్ ను తరచుగా ముహంపై స్ప్రే చేస్తూ ఉంటే, అలసట అనేది తగ్గి చర్మం తాజాగా ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపిస్తుంది. అలాగే తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ రోజ్ వాటర్ ను స్మెల్ చూస్తే చాలు తల నొప్పి ఈజీగా తగ్గిపోతుంది. అలాగే మీరు తలస్నానం చేసిన తర్వాత కూడా ఈ రోజ్ వాటర్ ను జుట్టుకు అప్లై చేసుకుంటే మంచి వాసన రావటంతో పాటుగా స్మూత్ గా కూడా మారుతుంది. అలాగే ఈ రోజ్ వాటర్ తో జుట్టుకు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టొచ్చు అని అంటున్నారు…
అలాగే రోజ్ వాటర్ లో కాటన్ ను ముంచి కనురెప్పలపై అప్లై చేసుకుంటే కళ్ళ చుట్టూ ఉన్న వేడి అనేది తగ్గిపోతుంది. దీంతో మీరు అలసట నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ రోజ్ వాటర్ ను వాడడం వలన దీర్ఘకాలంలో ఎన్నో రకాల లాభాలను పొందవచ్చు. అంతేకాక రోజ్ వాటర్ ను అధికంగా వాడేవారు ఈ విషయాలను కచ్చితంగా గుర్తించుకోవాలి. ఈ రోజ్ వాటర్ లో సహజమైనా యాంటీ ఏజింగ్ గుణాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇది అకాల వృద్ధప్యానికి కారణం అయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడగలిగే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంతో పాటు ముఖంపై ఉండే గీతలు మరియు మచ్చలు, ముడతలు లాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. అలాగే రోజ్ వాటర్ ను ముఖానికి మరియు చర్మానికి అప్లై చేసుకోవడం వలన యవ్వనమైన మరియు మెరిసే చర్మాన్ని మీరు పొందవచ్చు