Tea and Coffee : రాత్రిపూట టీకాఫీలు తెగ తాగేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం
Tea and Coffee : టీ కాఫీ.. ఇవి లేకుంటే రోజే గడవదు. ఉదయం లేవగానే ఓ కప్పు కాఫీ కానీ టీ కానీ తాగితేనే రిలీఫ్ గా ఉంటుంది. ఆరోజంతా యాక్టివ్ గా ఉంటాం. ఒక్క రోజు టీ కాఫీ తాగకున్నా కూడా యాక్టివ్ గా ఉండలేం. అందుకే చాలామంది లేవగానే.. కొందరు ముఖం కడుక్కోగానే చాయ్ తాగుతారు. కొందరికి కాఫీ అలవాటు ఉంటుంది. చాయ్ అయినా కాఫీ అయినా ఏదయినా కూడా మితంగా తీసుకుంటేనే మంచిది. నిజానికి.. ఆయుర్వేద నిపుణులు అయితే చాయ్ కాఫీలను అస్సలు తాగొద్దు అని చెబుతారు. కానీ.. ఆ అలవాటు చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్లు దాన్ని వదులుకోలేరు కాబట్టి.. మితంగా రోజుకు ఒక కప్పు లేదా రెండు కప్పులు మాత్రమే తాగాలంటూ సూచిస్తారు.
నిజానికి.. చాయ్, కాఫీలు తాగే అలవాటు ఎక్కువగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవాళ్లకు ఉంటుంది. ఉద్యోగులు కూడా ఎక్కువగా చాయ్ కాఫీలు తాగి పని చేస్తుంటారు. అయితే.. ఉదయం పూట కానీ.. సాయంత్రం పూట కానీ.. రోజుకు ఒకటి రెండు కప్పులు తాగితే ఓకే కానీ.. చాలామంది రాత్రి పూట కూడా చాయ్ కాఫీలను తెగ తాగేస్తుంటారు. అటువంటి వాళ్లకు ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Tea and Coffee : రాత్రిపూట టీకాఫీలు అస్సలు తాగకూడదట
రాత్రిపూట టీ కాఫీలను అస్సలు తాగకూడదట. రాత్రిపూట టీ కాఫీలను తాగితే ఏమౌతుందో తెలిస్తే మీరు కూడా వెంటనే తాగడం మానేస్తారు. సాధారణంగా ఒక కప్పు కాఫీలో 150 మిల్లీ గ్రాముల కెఫిన్ అనే మందు ఉంటుంది. ఒక కప్పు చాయ్ లో 150 మిల్లీ గ్రాముల టీఎన్ అనే మందు ఉంటుంది. నిజానికి కాఫీ కానీ.. టీ కానీ ఆహారం కాదు. అవి ఔషధాలు. కాఫీ, టీ లో ఉండే ఈ స్టిములెంట్స్.. నరాల వ్యవస్థను ఉద్రేక పరుస్తాయి. అందుకే.. కాఫీ కానీ.. టీ కానీ తాగగానే రీఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది. ఉత్సాహం వస్తుంది. అయితే.. ఈ స్టిములేషన్.. ఒక గంట మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వెంటనే నరాల వ్యవస్థ బలహీనం అవుతుంది.
అలా.. నరాల వ్యవస్థను అతిగా ఉద్రేక పరచడం.. ఆ తర్వాత ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల డిప్రెషన్ వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే.. టీ కాఫీలను తాగకూడదు. అయితే.. రాత్రిపూట ముఖ్యంగా అస్సలు తాగకూడదు, రాత్రి పూట మన శరీరం మెలటోనిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఇది కేవలం రాత్రి పూట మాత్రమే విడుదల అవుతుంది. ఈ హార్మోన్.. రాత్రి పూట విడుదల అయితేనే నిద్ర వస్తుంది. బాడీ మొత్తం రిలాక్స్ స్టేజ్ లోకి వెళ్తుంది. ఒకవేళ రాత్రి పూట టీ కాఫీలు తాగితే.. నిద్ర రావడానికి ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల కాదు. దీని వల్ల.. మనకు నిద్ర పట్టదు. దాని వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. శరీరం రిలాక్స్ కాదు. దాని వల్ల.. భవిష్యత్తులో చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే.. రాత్రి పూట అస్సలు టీ కాఫీలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి ==> నల్ల యాలకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
ఇది కూడా చదవండి ==> ఎన్నేళ్ల నుంచి షుగర్ ఉన్నా.. ఈ ఆకులను నమలండి.. షుగర్ వెంటనే కంట్రోల్ అవుతుంది..!
ఇది కూడా చదవండి ==> గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా? ఈ విషయం తెలిస్తే మీరు కూడా గడ్డం పెంచుకుంటారు?
ఇది కూడా చదవండి ==> మీకు వచ్చే కలలు మీ భవిష్యత్తును తెలియజేస్తాయి.. ఏ కల దేనికి సంకేతం ?