Raw Onion with Rice : అన్నంతో పాటు పచ్చి ఉల్లిగడ్డను తింటున్నారా? ముందు ఇది చదవండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raw Onion with Rice : అన్నంతో పాటు పచ్చి ఉల్లిగడ్డను తింటున్నారా? ముందు ఇది చదవండి..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :14 July 2021,11:23 pm

Raw Onion with Rice : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అందుకే.. ఏ వంటింట్లో చూసినా.. ఖచ్చితంగా ఉల్లిగడ్డ ఉంటుంది. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం. ఎందుకంటే.. కూరల్లో అదే ముఖ్యం. ఉల్లిగడ్డ లేకుండా కూర వండినా అది రుచి ఉండదు.. పచి ఉండదు. ఉల్లిగడ్డ లేకుండా మనకు ఏ వంటకం కూడా పూర్తికాదు. ఉల్లిగడ్డ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టే.. చాలామంది ఉల్లిగడ్డను కూరల్లో వాడుతారు. కొందరు పచ్చి ఉల్లిగడ్డను కూడా తింటారు. ఏ కూర వండినా.. ఉల్లిగడ్డ ఉండాల్సిందే. బిర్యానీలో అంచుకు పచ్చి ఉల్లిగడ్డను తినడం, సలాడ్ లో, పచ్చిపులుసులో.. ఎక్కడైనా సరే.. ఉల్లిగడ్డ కామన్ గా ఉండాల్సిందే.

eating raw onion with meals health benefits telugu

eating raw onion with meals health benefits telugu

చివరకు బడ్డీ కొట్టు దగ్గర మిర్చీ బజ్జీలు తిన్నా.. అక్కడ కూడా ఉల్లిపాయ ముక్కలు ఉండాల్సిందే. పానీపూరి అయినా భేల్ పూరి అయినా.. భయ్యా తోడా ప్యాస్ దాల్ అని అనాల్సిందే. అందుకే.. ఎక్కడ చూసినా ఉల్లిగడ్డ కామన్ గా కనిపిస్తుంది. అది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే.. శరీరంలోని చెడు కొలెస్టరాల్ ను కూడా ఉల్లిగడ్డ తగ్గిస్తుంది. అందుకే.. మనం ప్రతి కూరలో ఉల్లిగడ్డను వేసుకొని తింటున్నాం.

Raw Onion with Rice : అన్నంతో పాటు పచ్చి ఉల్లిగడ్డను తింటే ఏమౌతుంది?

నిజానికి ఉల్లిగడ్డలో క్వెర్సెటిన్ అనే పదార్థం ఉంటుంది. అది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మంటను తగ్గిస్తుంది. అలెర్జీని తగ్గిస్తుంది. బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. అదే పచ్చి ఉల్లిగడ్డను అలాగే.. భోజనంతో పాటు తినడం వల్ల.. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. పచ్చి ఉల్లిగడ్డలో రోగ నిరోధక శక్తిని పెంచే కారకాలు ఎక్కువగా ఉంటాయి.

eating raw onion with meals health benefits telugu

eating raw onion with meals health benefits telugu

ఉల్లిగడ్డలో విటమిన్స్ కూడా ఉంటాయి. మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి.. శరీరంలోని చాలా సమస్యలను దూరం చేస్తాయి. ఉల్లిగడ్డ.. యాంటీ బ్యాక్టీరియల్ గా , యాంటీ ఆక్సిడెంట్ గా, యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తుంది. అందుకే.. షుగర్ లేవల్స్ ను కంట్రోల్ చేయాలన్నా.. ఉల్లిగడ్డ సూపర్ గా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిగడ్డ.. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

eating raw onion with meals health benefits telugu

eating raw onion with meals health benefits telugu

క్యాన్సర్ కారకాలను నాశనం చేయడం, మెటిమలు, చర్మ సంబంధ వ్యాధులను తగ్గించడం, మూత్రాశయ ఇన్ఫెక్షన్ ను తగ్గించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం.. ఇలా చాలా రకాల జబ్బులకు ఒకే ఒక మందు ఉల్లిగడ్డ. ఉల్లిపాయ ముక్కలను కూరలో వేసి వండేటప్పుడు కొన్ని విటమిన్లు ఉండవు. అదే.. పచ్చి ఉల్లిగడ్డను తింటే మాత్రం చాలా లాభాలు కలుగుతాయి. అందుకే.. చాలామంది భోజనంతో పాటు లేదా బిర్యానీతో పాటు పచ్చి ఉల్లిగడ్డలను తింటుంటారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> నల్ల యాలకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎన్నేళ్ల నుంచి షుగర్ ఉన్నా.. ఈ ఆకులను నమలండి.. షుగర్ వెంటనే కంట్రోల్ అవుతుంది..!

ఇది కూడా చ‌ద‌వండి ==> గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా? ఈ విషయం తెలిస్తే మీరు కూడా గడ్డం పెంచుకుంటారు?

ఇది కూడా చ‌ద‌వండి ==> మీకు వ‌చ్చే క‌ల‌లు మీ భ‌విష్య‌త్తును తెలియ‌జేస్తాయి.. ఏ క‌ల దేనికి సంకేతం ?

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది