Diabetes : ఈ మూడు లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా షుగర్ వచ్చినట్టే? అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : ఈ మూడు లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా షుగర్ వచ్చినట్టే? అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :14 July 2021,9:15 pm

Diabetes : డయాబెటిస్ లేదా షుగర్ Diabetes లేదా మధుమేహం.. పేరు ఏదైనా.. ఈ వ్యాధి వల్ల చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ జనరేషన్ లో ఈ వ్యాధి తీవ్రంగా విరుచుకుపడుతోంది. డయాబెటిస్ Diabetes వ్యాధి ఒక్కసారి సోకితే.. జీవితాంతం మందులు వాడాల్సిందే. డయాబెటిస్ సమస్యతో బాధపడేవాళ్ల జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఆహారపు అలవాట్లు మారాలి. ఇలా.. చాలా విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. నిజానికి షుగర్ వ్యాధి వంశపారపర్యంగానూ వస్తుంటుంది. కొందరికి జీన్స్ ద్వారా వస్తే.. మరికొందరికి వాళ్ల జీవన విధానం వల్ల.. ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. ఎలా వచ్చినా షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే ఇక జీవితాంతం దానితో పోరాడాలి. అందులోనూ ప్రస్తుతం వయసుతో పనిలేకుండా.. అందరినీ అటాక్ చేస్తోంది షుగర్ Diabetes.

diabetes symptoms causes and treatment health tips telugu

diabetes symptoms causes and treatment health tips telugu

షుగర్ వచ్చినవాళ్లకు ఎక్కువగా ఆకలి వేస్తుంటుంది. వాళ్లు భోజనం తినడం ఒక్క గంట లేట్ అయినా కూడా ఆగలేరు. బాగా యూరిన్ రావడం, ఊరికే నీరసం, అలసట రావడం, ఇరిటేషన్ కలగడం లాంటివి జరుగుతుంటాయి. ఇదంతా షుగర్ వచ్చాక ఉండే లక్షణాలు. అయితే.. షుగర్ ఒక్కసారి కూడా రాని వాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం వాళ్లకు షుగర్ వస్తోందని అర్థం చేసుకోవాలి. షుగర్.. ఫస్ట్ స్టేజ్ లో ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే సరైన ట్రీట్ మెంట్ తీసుకుంటే.. షుగర్ ను తరిమికొట్టొచ్చు. లేట్ అయిందంటే.. ఇక జీవితాంతం మందులు మింగాల్సిందే.

diabetes symptoms causes and treatment health tips telugu

diabetes symptoms causes and treatment health tips telugu

Diabetes : నోరు ఎండిపోతోందా? అయితే.. మీకు షుగర్ వచ్చినట్టే?

నిజానికి షుగర్ Diabetes లో రెండు టైప్స్ ఉంటాయి. ఒకటి . ఈ రెండు టైప్ లు వచ్చిన వాళ్లలో నోరు ఊరికే ఎండిపోతుంటుంది. ఎన్ని మంచినీళ్లు తాగినా.. నోరు ఊరికే ఎండిపోతుంటుంది. అలా జరిగితే.. ఖచ్చితంగా డయాబెటిస్ వచ్చినట్టే. చాలామందదికి నోరు ఆరిపోవడంతో పాటు.. నాలిక పొడిగా తయారవుతుంది. నోట్లో లాలాజలం ఊరడం కూడా తగ్గుతుంది. పెదవులు కూడా బాగా పగిలిపోతాయి. ఇలా సడెన్ గా జరిగితే మాత్రం వాళ్లకు షుగర్ వ్యాధి వచ్చినట్టే. ఒక్కోసారి.. ఏదైనా తిన్నా కూడా నమిలినా కూడా చాలా కష్టంగా ఉంటుంది.

Diabetes

Diabetes

సడెన్ గా దంత సమస్యలు వచ్చినా షుగర్ Diabetes వచ్చినట్టే లెక్క. ఎందుకంటే.. షుగర్ లేవల్స్ ఒక్కసారిగా పెరిగి పోతే.. దంతాల వద్ద క్రిములు, పాచి పేరుకుపోయి.. దంతాలు చెడిపోతాయి. దాని వల్ల.. పుచ్చి పళ్లు అవుతాయి. పళ్లు ఊడిపోతాయి. దంతాల నుంచి ఒక్కోసారి తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. దంతాలు ఎర్రగా మారుతాయి. అలాంటి లక్షణాలు కనిపించినా కూడా డయాబెటిస్ వచ్చినట్టే. దంతాలు నొప్పి పుట్టినా.. పుచ్చి పోయినా.. అవి ఊడిపోయినా కూడా డయాబెటిస్ లక్షణాలు ఉన్నట్టే. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వెళ్లి షుగర్ టెస్ట్ చేయించుకోండి.

ఇది కూడా చ‌ద‌వండి ==> నల్ల యాలకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎన్నేళ్ల నుంచి షుగర్ ఉన్నా.. ఈ ఆకులను నమలండి.. షుగర్ వెంటనే కంట్రోల్ అవుతుంది..!

ఇది కూడా చ‌ద‌వండి ==> గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా? ఈ విషయం తెలిస్తే మీరు కూడా గడ్డం పెంచుకుంటారు?

ఇది కూడా చ‌ద‌వండి ==> మీకు వ‌చ్చే క‌ల‌లు మీ భ‌విష్య‌త్తును తెలియ‌జేస్తాయి.. ఏ క‌ల దేనికి సంకేతం ?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది