Corn : మొక్కజొన్న తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Corn : మొక్కజొన్న తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!

 Authored By aruna | The Telugu News | Updated on :27 July 2023,8:00 am

Corn : మొక్కజొన్న స్వీట్ గా ఉంటుంది దీనిని తినడానికి అందరూ ఇష్టపడతారు. ఉడికించి తినడం ద్వారా ఇంకా రుచి పెరుగుతుంది. స్వీట్ కార్న్ లో అనేక పోషక విలువలు ఉన్నాయి. మన శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన పోషక విలువలు ఈ స్వీట్ కార్న్లు పుష్కలంగా ఉన్నాయి. అదే విధంగా చాలా ఔషధ గుణాలు కూడా ఈ స్వీట్ కార్న్ లో ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. స్వీట్ కార్న్ తినటం ద్వారా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ మనల్ని యవ్వనంగా కనబడేలా వృద్ధాప్యాన్ని తొందరగా రాకుండా చర్మాన్ని యవ్వనంగా ఉండేందుకు సహాయం చేస్తుంది. స్వీట్ కార్న్ లో కార్బోహైడ్రేట్ స్పష్టంగా ఉంటాయి.

ఇవి మన శరీరానికి శక్తిని ఇస్తాయి. మనకి అలసట రానివ్వకుండా నిరంతరం శక్తిని ఇస్తుంది. స్వీట్ కార్న్ లో మెగ్నీషియం ,ఐరన్ ఉండటం వల్ల కీళ్ల నొప్పులను దరిచేరకుండా చూస్తుంది. వృద్ధులకు ఉడికించిన స్వీట్ కార్న్ విత్తనాలను తరచూ తినటం వల్ల కీళ్ల నొప్పులు నుండి విముక్తి పొందుతారు. స్వీట్ కార్న్ కు క్యాన్సర్ పై పోరాడే తత్వం ఉంది అని ఈ మధ్య జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. స్వీట్ కార్న్ మెదడు పనితీరు చురుగ్గా చేస్తుంది. మెదడులోని కణాలు పుట్టటానికి స్వీట్ కార్న్ లోని విటమిన్ బి1 సహాయం చేస్తుంది. స్వీట్ కార్న్ లో ఐరన్ ఉంటుంది. కావున రక్తహీనత ఉన్న వాళ్ళకి స్వీట్ కార్న్ ఔషధంలా పనిచేస్తుంది.

So many health benefits of eating corn

So many health benefits of eating corn

భవిష్యత్తులో రక్తహీనత సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా ఈ స్వీట్ కార్న్ తింటారు. స్వీట్ కార్న్ లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కళ్ళ వ్యాధులు దరిచేరకుండా కంటిన్యూ కాపాడుతుంది. స్పీడ్ కాలంలో ఫైబర్ ఉండటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాలను తొలగిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల స్థాయిని కంట్రోల్ చేస్తుంది. మొక్క జొన్న తినటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మరియు జుట్టు గట్టిగా ఉండేలా చేస్తుంది. తద్వారా జుట్టు రాలిపోవడం సమస్య నుండి కాపాడుతుంది. స్వీట్ కార్న్ విత్తనాలు తరచూ తినడం వల్ల మన శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

విత్తనాలను పేస్టులాగా చేసి ఆ పేస్టును మొటిమలపై రాస్తే మొటిమలు పోతాయి. స్వీట్ కార్న్ విత్తనాలను మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్టును ముఖంపై రాసుకొని 20 నిమిషాలు ఉంచుకొని ముఖమును చల్లటి నీటితో కడుక్కుంటే ముఖం యొక్క చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ఇందులో ప్రోటీన్ వల్ల ముఖం నిగారింపు కనిపిస్తుంది..

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది