Health Benefits : మొక్కజొన్న కేవలం రుచినే కాదండోయ్.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తుంది! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : మొక్కజొన్న కేవలం రుచినే కాదండోయ్.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తుంది!

Health Benefits : పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని మన జాబితాలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. సమతల ఆహారంలో ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పాలు వంటివి కచ్చితంగా ఉండాలి. కొలెస్ట్రాల్ తక్కువగా ఉండి.. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినమని ఆరోగ్య శాస్త్ర నిపుణులు సూచిస్తారు. అయితే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో మొక్కజొన్న కంకి ఒకటి. […]

 Authored By pavan | The Telugu News | Updated on :1 May 2022,6:00 am

Health Benefits : పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని మన జాబితాలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. సమతల ఆహారంలో ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పాలు వంటివి కచ్చితంగా ఉండాలి. కొలెస్ట్రాల్ తక్కువగా ఉండి.. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినమని ఆరోగ్య శాస్త్ర నిపుణులు సూచిస్తారు. అయితే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో మొక్కజొన్న కంకి ఒకటి. మొక్కజొన్న కంకిని కాల్చినా, గారెలు చేసినా, ఆ పిండితో రొట్టెలు చేసినా.. మరేం చేసినా సరే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇన్న రకాలుగా నోరూరించే మొక్కజొన్నతో కల్గే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ధాన్యాల్లో మొక్కజొన్న ఒకటి. ఈ ధాన్యంలో విటామిన్లు ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. సాధారణంగా అందరూ కాల్చుకొని తినడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. అయితే మొక్కజొన్నలో ఎరుపు, నలుపు, నీలం, గోధుమ వంటి రంగుల్లో లభిస్తాయి. అలాగే స్వీట్ కార్న్ పేరిట అందరినీ ఆకర్షిస్తుంది. బలహీనంగా ఉన్న వారికి శక్తి ఎక్కువ అవసరం. సాధారణంగా ఉన్నవారు కూడా ఎక్కువ పని చేయగానే అలిసిపోతుంటారు. అయితే మొక్కజొన్న సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కల్గి ఉంటుంది. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. అందువల్ల ఎక్కువ సేపు శక్తి ఉండేలా చేస్తాయి. సుమారు 100 గ్రాముల మొక్కజొన్న 21 గ్రాముల పిండి పదార్థాలను కల్గి ఉంటుంది.

amazing Health Benefits of corn

amazing Health Benefits of corn

ఇది శారీరక శక్తిని అందించడమే కాకుండా మెదడు మరియు నాడీ వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. అంతే కాదండోయ్ ఐరన్, విటామిన్ బి12 మొక్కజొన్నలో ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తహీనత సమస్యలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తాజా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన పోషకాలను మొక్కజొన్న చేకూరుస్తుంది.అలాగే రక్తంలో చక్కెర మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మొక్కజొన్నలో ఉండే కెరోటినాయిడ్ల వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ బరును నియంత్రిస్తుంది. అలాగే గ్లూటెన్ ఫ్రీ కాబట్టి జిగురు, బంక వంటి సమస్యలు ఉండవు. అందుకే అన్ని ధాన్యాల్లోకెల్లా ముఖ్యమైన ధాన్యాలు మొక్కజొన్న కంకులు. కాబట్టి దీన్ని మీకు నచ్చిన రూపంలో తీస్కొని ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది