Spinach Juice : అందం, ఆరోగ్యం మీ సొంతం కావాలంటే… పాలకూర రసాన్ని తీసుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Spinach Juice : అందం, ఆరోగ్యం మీ సొంతం కావాలంటే… పాలకూర రసాన్ని తీసుకోండి…!

Spinach Juice : మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల ఆకుకూరలను తీసుకుంటూ ఉంటాం.అయితే ఈ ఆకుకూరలలో పాలకూర కూడా ఒకటి. ఈ పాలకూర అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో శరీరానికి ఎంతో అవసరమైన ఎన్నో రకాల పోషకాలు దొరుకుతాయి. అలాగే దీనిలో విటమిన్లు మరియు ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇది దీర్ఘకాలిక సమస్యలను తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే పాలకూర మాత్రమే కాకుండా పాలకూర రసాన్ని తీసుకోవడం […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 September 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •   Spinach Juice : అందం, ఆరోగ్యం మీ సొంతం కావాలంటే... పాలకూర రసాన్ని తీసుకోండి...!

Spinach Juice : మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల ఆకుకూరలను తీసుకుంటూ ఉంటాం.అయితే ఈ ఆకుకూరలలో పాలకూర కూడా ఒకటి. ఈ పాలకూర అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో శరీరానికి ఎంతో అవసరమైన ఎన్నో రకాల పోషకాలు దొరుకుతాయి. అలాగే దీనిలో విటమిన్లు మరియు ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇది దీర్ఘకాలిక సమస్యలను తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే పాలకూర మాత్రమే కాకుండా పాలకూర రసాన్ని తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ పాలకూర రసాన్ని తీసుకోవడం వలన కంటి ఆరోగ్యం అనేది ఎంతో మెరుగుపడుతుంది.

దీనిలో ఉన్నటువంటి విటమిన్ ఏ గ్లాకోమా లాంటి కంటి సమస్యలను నియంత్రించి కంటి చూపుని ఎంతో మెరుగుపరుస్తుంది. అలాగే దృష్టి లోపం లేకుండా కూడా చూస్తుంది. అంతేకాక రక్తహీనత సమస్యలను నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది.ఈ పాలకూర రసం తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి అనేది ఎంతగానో పెరుగుతుంది. అలాగే సీజనల్ గా వచ్చే సమస్యలతో పోరాడేందుకు ఎంతో శక్తిని కూడా ఇస్తుంది. అలాగే వైరస్ మరియు బ్యాక్టీరియాలు కూడా ఎటాక్ చేయకుండా చూస్తోంది. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు ఎటాక్ చేయకుండా గుండె ఆరోగ్యాన్ని రక్షించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రసాన్ని తాగటం వలన చర్మం మరియు జుట్టు ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది.

Spinach Juice అందం ఆరోగ్యం మీ సొంతం కావాలంటే పాలకూర రసాన్ని తీసుకోండి

Spinach Juice : అందం, ఆరోగ్యం మీ సొంతం కావాలంటే… పాలకూర రసాన్ని తీసుకోండి…!

ఈ రసాన్ని తాగటం వలన వృద్ధాప్య ఛాయలు తొందరగా ఎటాక్ చేయకుండా ముడతలు అనేవి రాకుండా ముఖాన్ని ఎంతో కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. అలాగే జుట్టు రాలకుండా దృఢంగా మరియు బలంగా ఉండేలా కూడా చేస్తుంది. ఈ పాలకూరలో యాంటీ యాక్సిడెంట్లు అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించేందుకు ఎంతో హెల్ప్ చేస్తాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే ఈ పాలకూర రసాన్ని తీసుకోవటం వలన బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది