Summer Drinks : ఈ సమ్మర్ లో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే.. రోజు ఒక గ్లాస్ ఇది తాగితే చాలు…!
ప్రధానాంశాలు:
Summer Drinks : ఈ సమ్మర్ లో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే.. రోజు ఒక గ్లాస్ ఇది తాగితే చాలు...!
Summer Drinks : వేసవికాలంలో అడుగుపెట్టేసాం. ఇక రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఈ తీవ్రమైన ఎండలకి శరీరం డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే తరచుగా శరీరానికి చల్ల చల్లని డ్రింకులను అందించాలి. సీజన్లో కొన్ని రకాల ఫ్రూట్ జ్యూస్ లు ఆరోగ్యకరమైన డ్రింకులు తాగుతూ శరీరాన్ని హైడ్రేడ్ గా గా ఉంచడం చాలా ముఖ్యం. ప్రధానంగా సమ్మర్ డ్రింక్స్ లలో నిమ్మరసం ఒకటి.ఇది శరీరానికి మంచిది. ఇది శరీరాన్ని కావలసిన విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ ఎలక్ట్రోలైట్స్ అందిస్తుంది. నిమ్మకాయ నీరు తాగే వారికి వేసవిలో వడదేబ్బ ముప్పు తప్పుతుంది. గ్లాస్ నిమ్మరసం తాగితే 6 ముఖ్యమైన హెల్త్ ఉపయోగాలు ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మెరుగైన నిద్ర: నిమ్మరసాన్ని నీటిలో కలిపి స్నానం చేస్తే శరీరం రిఫ్రెష్ గా ఉంటుంది. దాంతో నిద్ర నాణ్యత పెరుగుతుంది. టాక్సిన్ సైతం బయటికి పంపిస్తాయి. శ్వాస కోస వ్యవస్థ మెరుగుపడుతుంది. అయితే ఉదయం పరిగడుపున నిమ్మరసంలో కొద్దిగా తేనె కలుపుకొని తాగితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అయితే గుండెల్లో మంట, యాసిడ్ సమస్యలతో ఇబ్బంది పడేవారు నిమ్మ రసాన్ని తాగకపోవడమే మంచిది. కీళ్లవాపు, కీళ్ల నొప్పులు బాధితులు కూడా ఈ డ్రింక్ తాగకూడదు.
Summer Drinks వర్కౌట్స్కు మంచి డ్రింక్
నిమ్మరసం వేడి తాపాన్ని తగ్గించడమే కాకుండా శారీరక శ్రమతో చెమట రూపంలో పోయిన సోడియం నష్టాన్ని సమతుల్యం చేస్తుంది. వ్యాయామానికి ముందు నిమ్మరసం తాగితే శరీరానికి ఇమ్యూనిటీ లభిస్తుంది. దీంతో వర్కౌట్ సమయంలో ఎనర్జిటిక్ గా ఉంటారు..
Summer Drinks మానసిక ప్రశాంతత
నిమ్మ సిట్రస్ జాతికి చెందిన పండు దీనిలోని ప్లేవనాయిడ్స్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ ఇన్ఫమ్లేషన్ తగ్గిస్తుంది. మొలల సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది..
కిడ్నీ స్టోన్ కి చెక్; నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. వేసవిలో తరచుగా నిమ్మరసం తాగితే ఆరోగ్యం మెరుగు పడుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఈ డ్రింక్ అడ్డుకుంటుంది. దాంతో మూత్రపిండా వ్యాధుల నుండి విముక్తి కలుగుతుంది..
అధిక బరువుకి చెక్: సమ్మర్ లో నిమ్మరసం తాగితే శరీరం హైడ్రేట్ గా మారుతుంది. నిమ్మలోని ఆంటీ ఆక్సిడెంట్ టు జీవ క్రియ రేటింగ్ మెరుగుపరుస్తుంది. మెటబాలిజం పెరిగినప్పుడు శరీరంలో ఫ్యాట్ కరిగిపోతుంది. దీంతో దీర్ఘకాలంలో బరువు తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
చర్మ సంరక్షణ: నిమ్మరసంలో యాంటీ ఏజింగ్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. నిమ్మరసంలోని విటమిన్ సి కొల్లాజని ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది ప్రిరాడికల్స్ ని పోరాడడానికి చర్మంపై ఆక్సికరణ ఒత్తిడి ప్రభావితం తగ్గిస్తుంది..
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: నిమ్మరసంలోని ఆమ్లత్వం పొట్ట ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. వేసవిలో రోజు ఒక గ్లాసు నిమ్మరసం తాగితే కడుబ్బరం లాంటి సమస్యలు తగ్గుతాయి. దీనిలోని ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తూ పొట్టను శుభ్రం చేస్తుంది..