Mung Bean : సమ్మర్ లో శరీరాన్ని చల్లబరుచుటకు ఈ పప్పుధాన్యాలు తినండి ..! ఈ వ్యాధులకు చెక్..వీటిని ఎలా తినాలో తెలుసా…?
ప్రధానాంశాలు:
Mung Bean : సమ్మర్ లో శరీరాన్ని చల్లబరుచుటకు ఈ పప్పుధాన్యాలు తినండి ..! ఈ వ్యాధులకు చెక్..వీటిని ఎలా తినాలో తెలుసా...?
Mung Bean : సమ్మర్ వచ్చిందంటే ఎండలు మండిపోతాయి. దీంతో శరీరం ఎండ త్రివ్రతకు గురవుతుంది. మరి ఎండాకాలంలో శరీర వేడిని తగ్గించుటకు.ఈ పప్పుధాన్యాలు తినాలి. అదే పెసలు. ఈ పెసలు అనేవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. దీనిలో ఎన్నో పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో పెసలను తింటే శరీరం చల్లబడుతుంది. అలాగే బీపి, షుగర్ వంటి సమస్యలు కూడా అదుపులోకి వస్తాయి. కాబట్టి, పెసలను ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే ఉత్తమం.

Mung Bean : సమ్మర్ లో శరీరాన్ని చల్లబరుచుటకు ఈ పప్పుధాన్యాలు తినండి ..! ఈ వ్యాధులకు చెక్..వీటిని ఎలా తినాలో తెలుసా…?
Mung Bean పెసలు ఎలా వినియోగించాలి
వేసవికాలంలో పెసరపప్పు, పెసరపప్పు చారు, పెసరట్టు వంటి వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పెసలు ముఖ్యంగా శరీరాన్ని చల్లబరుచుటకు, శరీరానికి కావలసిన శక్తిని అందించుటకు కూడా ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఈ పెసలను ఉడికించి తింటే మరింత ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పెసలు శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందించి అద్భుతమైన ఆహారంగా పరిగణించబడింది. వీటిలో విటమిన్లు, మినరల్స్ ఏంటివి శరీరానికి చాలా మేలు చేస్తాయి.
పెసలు ఈ వ్యాధులకు చెక్
బీపీ సమస్య ఉన్నవారు పెసలను తమ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పెసలలో పోషకాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. తద్వారా రక్తపోటుని నియంత్రించగలదు. పెసలు నువ్వు తరచూ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.పెసలను ప్రతిరోజు తీసుకుంటే చర్మం కాంతివంతంగా, అందంగా మారుతుంది. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి కాపాడగలదు. ఇంకా కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది.పెసల్లో అధికంగా ఐరన్ కూడా ఉంటుంది. ఇది రక్త హిమోగ్లోబిన్ పెంచుతుంది. సీజన్ సరఫరా మెరుగు పడుతుంది. తో రక్తహీనత సమస్య కూడా తగ్గిపోతుంది. ఇందులో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. రక్తంలో చక్కర స్థాయిలను అదుపులో ఉంచుటకు కూడా సహాయపడుతుంది. ఇన్సులిన్ నియంత్రణ కోసం పెసలను తరచూ తింటే మంచిది. పేషెంట్లకు ఇది దివ్య ఔషధం.పెసలలో ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుంది. జీర్ణ సమస్యలను తగ్గించుటకు, మలబద్ధకం, అజీర్ణం, బ్లోటింగ్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. పెసలను తినడం వల్ల నెమ్మదిగా జీర్ణమయే కార్బోహైడ్రేట్లో శరీరానికి శక్తిని అందిస్తాయి. బరువు తగ్గాలని అనుకునేవారు డైట్ ని చేసేవారు శక్తిని పెంచుకోవాలనుకుంటే పెసలను ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
పెసల్లో ఉన్న ప్రోటీన్ మజిల్స్ పెరగడంలో ఎంతో ఉపయోగపడుతుంది.ఉదయాన్నే పెసలను మొలకలుగా లేదా ఉడికించి తింటే శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్ అందుతుంది. దీంతో రోజంతా శక్తివంతంగా ఉండొచ్చు. అలాగే హై ప్రోటీన్ డైట్ లో పెసలను చేర్చుకుంటే శరీరానికి పూర్తి పోషకాలు అందుతాయి. పెసలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ పెసలను తీసుకోవడం వల్ల వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. పైగా బీపి, షుగర్ లాంటి సమస్యలు అదుపులో ఉంచుకోవచ్చు. కాబట్టి పెసలను డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోజు కందిపప్పుని ఎక్కువగా వినియోగిస్తారు. దాంతో పప్పు సాంబార్ చేస్తుంటారు, అప్పుడప్పుడు పెసలతో కూడా పప్పు, సాంబార్లు వంటివి చేసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సాయంత్రం సమయంలో స్నాక్స్ లాగా పెసలు ఉడికించి తింటే ఇంకా మంచిది. వీటిని మొలకలుగా చేసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు. వీటిని తింటే స్పెషల్ యొక్క పోషకాలు పుష్కలంగా అందుతాయి. వేసవి సవితాపం నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.