Papaya : బొప్పాయిని ఈ టైంలో తీసుకుంటే చాలు… ఆరోగ్యం తో పాటు అందం మీ సొంతం…!!
Papaya : ప్రస్తుత కాలంలో మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం.అయితే పండ్లు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అనే విషయం అందరికీ తెలిసినదే. కానీ ఎవరు పెద్దగా దీనిని పట్టించుకోరు. ఈ పండ్లను తీసుకుంటే ఉండే లాభాలే వేరు. ఇలా మీకు మేలు చేసే వాటిలలో బొప్పాయి పండు కూడా ఒకటి అని చెప్పొచ్చు. అయితే ఈ బొప్పాయితో ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. మీరు గనక ప్రతినిత్యం […]
ప్రధానాంశాలు:
Papaya : బొప్పాయిని ఈ టైంలో తీసుకుంటే చాలు... ఆరోగ్యం తో పాటు అందం మీ సొంతం...!!
Papaya : ప్రస్తుత కాలంలో మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం.అయితే పండ్లు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అనే విషయం అందరికీ తెలిసినదే. కానీ ఎవరు పెద్దగా దీనిని పట్టించుకోరు. ఈ పండ్లను తీసుకుంటే ఉండే లాభాలే వేరు. ఇలా మీకు మేలు చేసే వాటిలలో బొప్పాయి పండు కూడా ఒకటి అని చెప్పొచ్చు. అయితే ఈ బొప్పాయితో ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. మీరు గనక ప్రతినిత్యం ఉదయం బొప్పాయిని బ్రేక్ ఫాస్ట్ లో కొద్దిగా తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. దీని వలన మీ ఆరోగ్యంతో పాటుగా చర్మం కూడా ఎంతో అందంగా ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు మరియు మలబద్దక సమస్యతో ఇబ్బంది పడేవారు తప్పనిసరిగా బొప్పాయిని తీసుకోవాలి…
ఉదయం తినడం ఇష్టం లేనివారు సాయంత్రం వేళల్లో లేకుంటే రాత్రి పడుకునే టైంలో కూడా తినవచ్చు. అలాగే సాయంత్రం నాలుగు లేక ఐదు గంటల టైం లో కూడా తినవచ్చు. అంతేకాక రాత్రి తీసుకోవాలి అని అనుకునేవారు భోజనం చేసిన రెండు గంటల తర్వాత బొప్పాయిని తీసుకుంటే మంచి పోషకాలు మీకు అందుతాయి. అంతేకాక షుగర్ ఉన్నవారు బొప్పాయిని ఉదయం పూట తినకపోవడమే మంచిది. ఈ బొప్పాయిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కావున శరీరంలో ఉండే మలినాలు మరియు విష పదార్థాలు, చెడు పదార్థాలు అనేవి వెంటనే బయటికి వెళ్లిపోతాయి.
ఉదయం బొప్పాయిని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. అలాగే వెంటనే శక్తి కూడా అందుతుంది. కావున స్కూళ్లకు మరియు ఆఫీసులకు వెళ్లేవారు హుషారుగా ఉండేందుకు బొప్పాయిని తీసుకుంటే మంచిది. అలాగే పిల్లలకు లంచ్ బాక్స్ లో పెట్టిన బ్రేక్ ఫాస్ట్ టైం లో తింటారు…