Tulsi Water : పరిగడుపున తులసి నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు.. అవేంటంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tulsi Water : పరిగడుపున తులసి నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు.. అవేంటంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :19 May 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Tulsi Water : పరిగడుపున తులసి నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు.. అవేంటంటే..!

Tulsi Water : ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో చిట్కాలు ఉన్నాయి. అందులో చూసుకుంటే తులసితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అంతా ఇంతా కాదు. అయితే ఖాళీ కడుపుతో తులసి నీళ్లను తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అంతా ఇంతా కాదు. దాని వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటి, జీర్ణ సంబంధిత సమస్యలు అన్నీ దూరం అవుతాయి. ఇది బాడీని క్లీన్ గా ఉంచడంలో అలాగే ఆరోగ్యకరమైన జీర్ణ ప్రక్రియను మెరుగు పరచడంలో సాయం చేస్తుంది. పరిగడుపున తాగితే కడుపును క్లీన్ చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మలబద్దకం సమస్యను పూర్తిగా నయం చేస్తుంది.

Tulsi Water చర్మం ఆరోగ్యానికి..

ఇక శ్వాసకోస ఆరోగ్యాన్ని కూడా కాపాడటంలో సాయం చేస్తుంది. అందుకే దీన్ని దివ్య ఔషధంగా భావిస్తుంటారు. ఇంకో విషయం ఏంటంటే తులసి నీళ్లను తాగడం వల్ల డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. అంటే కడుపులో ఏమైనా ట్యాక్సిన్స్, క్రిములు ఉంటే బయటకు పంపించేస్తుంది తులసి వాటర్. జీర్ణ సంబంధ వ్యాధులు దూరంగా ఉంటాయి. ఇక చర్మం ఆరోగ్యానికి కూడా తులసి నీళ్లు బాగానే ఉపయోగపడుతాయి. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగపడతాయి.

దాంతో మన చర్మం ఎంతో కాంతివంతంగా పని చేస్తుంది. ఇక మరో గొప్ప ఆరోగ్య ప్రయోజనం ఏంటంటే తులసి నీళ్లను తాగితే ఒత్తిడి పూర్తిగా దూరం అవుతుంది. ఎందుకంటే తులసి నీళ్లు కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలను నిర్వహించేందుకు సాయం చేస్తుంది. ఇప్పటికే ఈ విషయాలను కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది బాడీలో ఒత్తిడి కలిగించే హార్మోన్ ను తగ్గిస్తుంది. దాంతో ఆ రోజంతా మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండానే ఉంటారు. అంతే కాకుండా బాడీలో కొవ్వులు కరిగేందుకు కూడా తులసి నీళ్లు బాగానే పని చేస్తుంటాయి. ఇందులో ప్రత్యేక ఎంజైమ్స్ ఉంటాయి.

Tulsi Water పరిగడుపున తులసి నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు అవేంటంటే

Tulsi Water : పరిగడుపున తులసి నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు.. అవేంటంటే..!

వాటి వల్ల బాడీలోని కొవ్వు పదార్థాలు తగ్గిపోతుంటాయి. అంతే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే మీరు ప్రతి రోజూ తులసిని తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది