Dental : మీ దంత సిరి ఆరోగ్యాన్ని పెంచే పండ్లు ఇవే.. రోజుకి ఒకటి తింటే చాలు…!
ప్రధానాంశాలు:
Dental : మీ దంత సిరి ఆరోగ్యాన్ని పెంచే పండ్లు ఇవే.. రోజుకి ఒకటి తింటే చాలు...!
Dental : మీ నవ్వు అందంగా కనిపించడానికి దంత సిరి ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఇవి మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. మీ దంతాలు Dental అందంగా కనిపించాలంటే మీరు ఖరీదైన వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో దొరికే సాధారణ పండ్ల తిన్న సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పళ్ళు మన శారీరక ఆరోగ్యం ,మానసిక స్థితి మరియు వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. మంచి ఆహారాన్ని నోటికి రుచి తగిలేలా మనల్ని ఆనందపచేస్తాయి. అయితే మీ దినచర్యలో కొన్ని ఆహారాలను చేర్చుకోవడం వలన శరీర ఆరోగ్యంతో పాటుగా నోటి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Dental : మీ దంత సిరి ఆరోగ్యాన్ని పెంచే పండ్లు ఇవే.. రోజుకి ఒకటి తింటే చాలు…!
మంచి దంత Dental సంపదకు ప్రతిరోజు ఒక యాపిల్ నీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఆపిల్ నీ సహజ ” టు బ్రష్ ” అని కూడా పిలుస్తారు. ఆపిల్ దంత క్షయం కలిగించే బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. అలాగే లాలాజల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో నోటిని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. స్ట్రాబెర్రీలు కూడా దంత ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా అరటి పండ్లు తినడం వలన దంత ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎందుకంటే అరటిపండ్ల లో మెగ్నీషియం ,పొటాషియం, మాంగానీస్ వంటి ఖనిజాలు నుండి ఉంటాయి. ఇవి దంతాల ఆరోగ్యానికి మేలు ని కలిగిస్తాయి. ఇక భోజనం చేసిన తరువాత పుదీనా గ్రీన్ టీ Green Tea ని ఇంట్లో తయారు చేసుకొని తాగడం వలన నోటి పరిశుభ్రత ,తాజా శ్వాస ,నోటి ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.
చిలకడదుంప లో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది పంటి ఎనామిల్ ను కాపాడుతుంది. అలాగే దంతాల ను ఆరోగ్యంగా ఉంచడంలో ముందుంటుంది. పాలకూరలో విటమిన్ A, B2,B12 ఉంటాయి. ఇవి నేరుగా చిగుర్లు దంతాల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వీటితో పాటుగా శీతాకాల సంరక్షణ చిట్కాలను పాటించడం వలన నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మీ దంతాలకు చల్లటి గాలి తగలకుండా చూసుకోవాలి. తీవ్రమైన చలిలో బయటకు వెళ్తున్నప్పుడు మీ దంతాలను రక్షించడం కోసం మౌత్ గార్డ్ ధరించడం మంచిది. దీనిని ఉపయోగించడం వల్ల వేచ్చదనం తేమ, మీ నోరు ఎండిపోకుండా నిరోధిస్తుంది. ఒకవేళ పంటికి చల్లని గాలి తగిలితే దంతక్షయం ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇది లాలాజలాన్ని తగ్గిస్తుంది.