Health Tips : ఈ నల్లని పండ్లు ఆ ప్రమాదకర వ్యాధులకి గొప్ప ఔషధం..!!
Health Tips : ఆ నల్లని పళ్ళు తినడం వలన ఈ ప్రమాదకర వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. సహజంగా ఎన్నో ఫ్రూట్స్ను మనం తింటూ ఉంటాం. అయితే పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని పండ్లు పోషకాలతో నిండి ఉంటాయి. ఈ పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి అన్ని పండ్లు తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే వ్యాధుల విషయంలో పండ్ల వినియోగం విషయానికి వస్తే పండ్లను ఎంచుకోవడం చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులో నలుపు పండ్లు తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి నల్లటి పండ్లు తినాలి.. నల్లటి పండ్లను పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
వీటిలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్ రక్తపోటు మధుమేహం లాంటి వ్యాధుల్ని తగ్గిస్తాయి. అయితే ఈ నల్లటి పండ్లలో ఏది తీసుకుంటే మంచిది అనే విషయాలు మనం చూద్దాం… బ్లాక్ కిస్ మిస్ : నల్ల కిస్మిస్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ అధికంగా ఉంటాయి. నల్ల కిస్మిస్లు రక్తపోటును తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వలన ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. నల్ల కిస్మిస్లు రక్తహీనతను కూడా తగ్గిస్తాయి. నల్ల రేగు పండ్లు : బ్లాక్ బెర్రీస్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఫైబర్ ,మాంగనీస్, విటమిన్ సి లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యంగా ఉండేలా ఉపయోగపడతాయి. అలాగే బ్లాక్ బెర్రీస్ కొలెస్ట్రాల్ను కంట్రోల్లో ఉంచుతాయి. అదేవిధంగా డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.
నల్ల అత్తి పండ్లు : బ్లాక్ అంజీర్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఉండే ప్రోబయోటిక్ గుణాలు జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అత్తి పండ్లలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది బరువుని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్లాక్ చెర్రీ : చాలామందికి చెర్రీ ఎరుపు గురించి మాత్రమే తెలుసు.. బ్లాక్ చెర్రీ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ బ్లాక్ చర్యలో యాంటీ ఇన్ఫ్లోమెంటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ క్రియల నొప్పు లాంటి సమస్యలను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి.. నల్ల ద్రాక్ష: నల్ల ద్రాక్ష రుచులు పుల్లగా ఉంటుంది. కానీ అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మం జుట్టుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.