Winter : చలికాలంలో పెరుగు తింటే జరిగేది ఇదే…!
Winter : మనం తీసుకునే ఆహారంలో చాలా ముఖ్యమైనది పెరుగు. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పంచభక్ష పరమాన్నాలు తిన్నా కానీ చివరిలో పెరుగన్నం తినకపోతే ఆ భోజనం పూర్తయినట్టుగా అనిపించదు.. చివరిలో పెరుగన్నం తినకుంటే మాకు పూర్తిగా అన్నం తిన్న ఫీలింగే ఉండదంటారు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు.. తెలుగులో ఉండే ఔషధ గుణాలు చిన్న చిన్న జబ్బులు మొదలుకొని ఎన్నో దీర్ఘకాలిక జబ్బులు కూడా మందులా పని చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ మరియు ప్రోటీన్లు మానవ శరీరంకు అద్భుతమైన బలంను మరియు రోగనిరోధక శక్తిని కూడా ఇస్తుంది. మన శరీరంకు కావలసిన పోషకాలను కూడా పెరుగు ఇస్తుందని శాస్త్రీయంగా నిరూపితం అయింది.
పెరుగును ఏ రకంగా తీసుకున్న కూడా అద్భుతమైన ప్రయోజనాలు చేకూర్తాయని నిపుణులు చెబుతూ ఉంటారు. పెరుగు వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల విషయానికొస్తే పెరుగు రెగ్యులర్గా తినడం వల్ల అధిక బరువు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. పెరుగులో కొవ్వు తక్కువగా ఉండి ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కనుక కొద్దిగా పెరుగన్నం తినడం వల్ల కావలసిన శక్తి లభిస్తుంది. తద్వారా శరీరంలో కొవ్వు పెరుగు తీసుకోవడం వల్ల మెల్లమెల్లగా కొవ్వు కరిగిపోయి బరువు తగ్గుతారు. పెరుగును రైత లేదా లస్సి రూపంలో తాగి ఒక పూట భోజనం కు దూరంగా ఉండటం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.అయితే మనలో చాలామంది చలికాలం రాగానే పెరుగు మానేస్తూ ఉంటారు. దానికి కారణం జలుబు, దగ్గు సైనస్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయిఅని కానీ ఇది ఎంతవరకు నిజం, చలికాలంలో పెరుగు మానేయడం కరెక్టేనా ఇప్పుడు చూద్దాం.. అయితే నీ పనులు చెప్పే దాని ప్రకారం పెరుగు తరచు తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అంటే మన శరీరానికి హాని చేసే జలుబు దగ్గు నుంచి రక్షించడానికి పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పెరుగులో ఉండే పోషకాలు వ్యాధులనుంచి అంటే డైజేషన్ ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పెరుగులో ఉండే క్యాల్షియం మన ఎముకలకి దంతాలకి చాలా సహాయపడుతుంది. అయితే ఆస్తమా వంటి జబ్బులు ఉన్నవారు పెరుగుని చలికాలంలో తీసుకోకపోవడం మంచిది. ఇక పెరుగును రాత్రి వేళల్లో తీసుకోవటమే అంటే పగటివేలలో తీసుకోవడమే శ్రేయస్కరం. అంతేకాకుండా పెరుగును ఫ్రిడ్జ్ లో నుంచి తీసి డైరెక్ట్ గా తీసి యూస్ చేయటం కంటే దాన్ని చల్లదనం పోయేంతవరకు వెయిట్ చేసి వాడితే ప్రయోజనాలు ఉంటాయి…