Hair Tips : తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవాలంటే రంగే అక్కర్లేదు.. ఈ నూనె రాస్కుంటే సరిపోతుంది! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవాలంటే రంగే అక్కర్లేదు.. ఈ నూనె రాస్కుంటే సరిపోతుంది!

 Authored By pavan | The Telugu News | Updated on :13 March 2022,4:30 pm

Hair Tips : 20 లేదా 30 వయసులో తెలుపు రంగు జుట్టును ఎవరూ ఇష్టపడరు. అయితే తెలుపు రంగు జుట్టును నల్లగా మార్చేందుకు ఎన్నెన్నో రకాలు షాంపూలు, నూనెలూ అవి చాలవన్నట్లు రంగులు వేస్కుంటూ ఉంటారు. అయితే రంగు వేస్కున్న వెంటనే అంటే కొద్ది కాలంలోనే మళ్లీ నలుపు రంగు పోయి తెలుపు రంగు కనిపిస్తుంటుంది. ఊర్కూరే రంగులు వేస్కోలేక డబ్బులు ఖర్చు చేయలేక మానసికంగా కూడా తెగ ఇబ్బంది పడిపోతుంటారు. అయితే రసాయన చికిత్సలు, కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారంతో బిజీ జీవన శైలి, ఒత్తిడి, శారీరక అనారోగ్యం, మానసిక పరమైన ఆందోళనలు అకాల బూడిద, జుట్టు నష్టానికి కొన్ని కరాణాలు మాత్రమే. అయితే అకాల బూడిదను నివారించడానికి

మీ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మీరు సహజంగా లభ్యమయ్యే పదార్థాలను ఎలా ఉపయోగించుకోవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం.జుట్టు రాలడాన్ని తగ్గించడంలో బీరకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మలినాలను తొలగించే మీ జుట్టును నల్లగా, బలంగా, పొడవుగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఇంట్లో తయారు చేసిన ఈ బీరకాయ హెయిర్ నూనెను కూడా ఒకసారి ప్రయత్నించండి. అయితే బీరకాయ బూడిద నివారణలో అత్యంత ప్రతిభావంతమైన ఆహార పదార్థాల్లో ఒకటి. ఇది శరీరంలోని వర్ణ ద్రవ్యాలను పునరుద్ధరించడానికి జుట్టును బలంగా తయారు చేయడానికి ఎంతగానో సాయపడుతుంది. ముందుగా ఒక బీరకాయను తీస్కొని చిన్న చిన్న ముక్కులుగా తరుక్కోవాలి. వీటిని నీడల మూడ్రోజుల వరకూ ఆరబెట్టి..

time tested to secret remedy for glow and long black hair

time tested to secret remedy for glow and long black hair

అవి ఎండిన తర్వాత మక్సీ జార్లో వి కప్పు కొబ్బరి నూనెలో ఈ మిశ్రమాన్ని వేసి మూడు, నాలుగు రోజుల పాటు నానబెట్టాలలి. ఆ తర్వాత ఈ నూనె పూర్తి నల్లగా మారిపోయేవరకు మరిగించాలి. నూనెను వడకట్టి నిల్వ చేయాలి. గరిష్ట ప్రయోజనాలు కోసం ఈ నూనేను వారానికి రెండు మూడు సార్లు వాడాల్సి ఉంటుంది. బీరకాయ శరీరంలో ఉండే మెలనిన్ శాతాన్ని పునరుద్ధరిస్తుంది. అయితే ది తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు చాలా బాగా సాయపడుతుంది. తెల్లని జుట్టును నల్లగా చేసే ఈ అద్భుతమైన బీరకాయ నూనె ప్రతీ ఒక్కరూ వాడొచ్చు. తెల్లగా, నిర్జీవంగా మారిన  మీ జుట్టు ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకొని… నల్లని, నాణ్యమైన కురలను మీ సొంతం చేసుకోవచ్చు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది