Tooth Pain : పంటి నొప్పితో బాధపడుతున్నారా..? ఈ సింపుల్‌ టిప్స్‌ పాటించండి.. వెంటనే ఫ‌లితం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tooth Pain : పంటి నొప్పితో బాధపడుతున్నారా..? ఈ సింపుల్‌ టిప్స్‌ పాటించండి.. వెంటనే ఫ‌లితం

Tooth Pain: పంటి నొప్పి ఎంత ఇబ్బంది పెడుతుందో మ‌న అంద‌రికి తెలిసిందే. పంటి నొప్పి స్టార్ట్ అయితే ఏం తిన‌లేం.. ఏం తాగ‌లేం.. ఏ ప‌ని మీద శ్ర‌ద్ధ చూప‌లేం.. ఒక్కోసారి పంటి నొప్పి వ‌ల్ల క‌న్ను, త‌ల‌నొప్పి వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంది. సాధార‌ణంగా దంతాలు పుచ్చిపోవడం, ఇన్ఫెక్షన్, కొత్తగా దంతాలు రావడం, దంతాల్లో పగుళ్లు రావడం, చిగుళ్ల వ్యాధులు ఇలాంటి కారణాల వల్ల పంటి నొప్పి వస్తుంది.సాధారణ పంటి నొప్పి, చిగుళ్లు ఉబ్బడం వల్ల […]

 Authored By mallesh | The Telugu News | Updated on :20 March 2022,7:00 am

Tooth Pain: పంటి నొప్పి ఎంత ఇబ్బంది పెడుతుందో మ‌న అంద‌రికి తెలిసిందే. పంటి నొప్పి స్టార్ట్ అయితే ఏం తిన‌లేం.. ఏం తాగ‌లేం.. ఏ ప‌ని మీద శ్ర‌ద్ధ చూప‌లేం.. ఒక్కోసారి పంటి నొప్పి వ‌ల్ల క‌న్ను, త‌ల‌నొప్పి వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంది. సాధార‌ణంగా దంతాలు పుచ్చిపోవడం, ఇన్ఫెక్షన్, కొత్తగా దంతాలు రావడం, దంతాల్లో పగుళ్లు రావడం, చిగుళ్ల వ్యాధులు ఇలాంటి కారణాల వల్ల పంటి నొప్పి వస్తుంది.సాధారణ పంటి నొప్పి, చిగుళ్లు ఉబ్బడం వల్ల కలిగే నొప్పిని కొన్ని సహజ పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చు. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల పంటి నొప్పి ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు చూద్దాం.ఇక పంటి నొప్పిని తగ్గించడంలో వెల్లుల్లి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటి బయోటిక్‌ గుణాలు తీవ్రమైన పంటి నొప్పి నుంచి కూడా వెంటనే రిలీఫ్‌ అందిస్తుంది.

వెల్లుల్లిని బాగా దంచి అందులో కొంచెం ఉప్పు లేదా మిరియాల పొడి కలిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది.కొన్నిసార్లు దంతాల్లో పేర్కొన్న వ్యర్థాల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్‌ ద్వారా కూడా పంటి నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గోరు వెచ్చటి నీటిలో కాస్త ఉప్పు వేసి నోట్లో వేసుకొని బాగా పుకిలించాలి. దీంతో దంతాల చుట్టూ, మధ్య పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి. నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. లవంగాలు కూడా పంటి నొప్పికి మంచి చిట్కాగా ఉపయోగపడతాయి. నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని పెట్టి నెమ్మదిగా నొక్కాలి దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.రెండు లేదా మూడు జామ ఆకుల‌ను తీసుకుని శుభ్రంగా క‌డిగి దంచుకోవాలి.

Tooth Pain tips in Salt garlic cloves

Tooth Pain tips in Salt garlic cloves

Tooth Pain : ఇలా చేస్తే త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం..

ఈ పేస్టును పంటి నొప్పి ఉన్న చోట ఉంచితే కొంత ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అలాగే ఈ ఆకుల‌ను వేడి నీటిలో మ‌రిగించి ఆ నీటి పుక్కిలించినా, తాగినా ఫ‌లితం ఉంటుంది. ఈ నీరు తాగ‌డం వ‌ల్ల డ‌యాబెటీస్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.ఇక చిగుళ్ల నొప్పికి చెక్‌ పెట్టడానికి ఆవ నూనెలో ఒక చిటికెడు ఉప్పును కలిపి చిగుళ్లపై మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. అప్పుడే కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై ఉంచుకోవడం వల్ల అప్పటికప్పుడు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక పంటి నొప్పి ఉన్న సమయంలో స్వీట్స్ వంటి ప‌దార్థాలు తిన‌కూడ‌దు, కూల్‌ డ్రింక్స్‌ ఎట్టి పరిస్థితుల్లో తాగ‌కూడదు. దీనివల్ల సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే పుదీనా కూడా పంటి నొప్పిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది