Tooth Tips : కేవలం రెండు స్పూన్లతో.. పసుపు రంగులో ఉన్న పళ్ళు తెలుపు రంగులోకి వస్తాయి…!
Tooth Tips : ప్రస్తుత జీవన శైలి కారణంగా వివిధ రకాల ఆహార పదార్థాలను తింటున్నాం. కానీ వాటి వలన మన ఆరోగ్యానికి నష్టం ఎక్కువగా కలుగుతుంది. అంతేకాకుండా మనకు జీవితకాలం అవసరమైన ఎంతో గట్టిగా ఉండే పళ్ళను కూడా నాశనం చేస్తున్నాయి. ఇటువంటి పళ్ళు పుచ్చుకోవడానికి, పళ్ళు యొక్క చిగుళ్ళు డ్యామేజ్ అవ్వడానికి మనం తినే చెడు ఆహారం కారణం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మూడు వంతుల మందికి పళ్ళ సమస్యలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా దంతాలు ఒరిజినల్ కలర్ లో లేకపోవడం, పళ్ళు గార పట్టడం వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి.
పళ్ళు తెల్లగా మారడానికి పళ్ళ మీద ఉన్న గార పోగొట్టడానికి ఆపిల్ స్లైడర్ వెనిగర్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆపిల్ స్లైడర్ వెనిగర్ డైరెక్ట్ గా ఉపయోగించడం వలన దంతాల పైన ఉండే ఎనామిల్ కాలిపోతుంది. మనకు తెలియక దానిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే ఆపిల్ స్లైడర్ వెనిగర్ లో 2.2-3 పీహెచ్ ఉంటుంది. ఇంత ఘాటు ఉన్న ఆపిల్ స్లైడర్ వెనిగర్ డైరెక్ట్ గా ఉపయోగించడమే కాకుండా బ్రష్ కూడా చేస్తున్నారు. దాని వలన చిగుళ్ళు కూడా నాశనం అవుతున్నాయి. అలాగే నోటిలో ఉండే మ్యూకస్ డామేజ్ అయ్యే మ్యూకస్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది.
ఇంతకీ దానిని ఎలా ఉపయోగించాలి అంటే 5.5 పీహెచ్ లెవెల్ ఉండేటట్టు చేస్తే దీని వలన ఎటువంటి నష్టం ఉండదు. డామేజ్ లేకుండా ఆపిల్ స్లైడర్ వెనిగర్ ఉపయోగించాలి. రెండు స్పూన్ల ఆపిల్ స్లైడర్ వెనిగర్ కు కొద్దిగా వాటర్ కలపడం ద్వారా పీహెచ్ లెవెల్ తగ్గుతుంది. దీన్ని మౌత్ వాష్ కింద ఉపయోగించుకోవచ్చు. ఆపిల్ స్లైడర్ వెనిగర్ డైరెక్ట్ ఎప్పుడు ఉపయోగించాలి అంటే పళ్ళు బాగా గాడ పట్టి పసుపు రంగులో ఉన్నప్పుడు దీన్ని డైరెక్ట్ గా చేతితో పళ్లకు అప్లై చేసి 20 సెకండ్ల పాటు ఉంచి వెంటనే కడిగేసుకోవాలి. తర్వాత అరగంట వరకు ఏమి తినకూడదు, త్రాగకూడదు. ఇలా చేయడం ద్వారా పళ్ళు పుచ్చవు, పాడవవు మరియు నోటి దుర్వాసన కూడా ఉండదు.