Tulsi Water : ప్రతిరోజు ఒక గ్లాస్ తులసి నీళ్లు తాగితే చాలు… ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం…!!
Tulsi Water : మనం తులసి మొక్కను ఎంత పవిత్రంగా పూజిస్తూ ఉంటాం. అయితే ఈ తులసి ఆకులను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. వీటితో ఎన్నో రకాల స్వల్ప కాలిక మరియు దీర్ఘకాలిక సమస్యలను తొలగించుకోవచ్చు. అలాగే ఈ తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. అయితే ఈ తులసి నీళ్ల ను తాగటం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు నిత్యం ఖాళీ […]
ప్రధానాంశాలు:
Tulsi Water : ప్రతిరోజు ఒక గ్లాస్ తులసి నీళ్లు తాగితే చాలు... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం...!!
Tulsi Water : మనం తులసి మొక్కను ఎంత పవిత్రంగా పూజిస్తూ ఉంటాం. అయితే ఈ తులసి ఆకులను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. వీటితో ఎన్నో రకాల స్వల్ప కాలిక మరియు దీర్ఘకాలిక సమస్యలను తొలగించుకోవచ్చు. అలాగే ఈ తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. అయితే ఈ తులసి నీళ్ల ను తాగటం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు నిత్యం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ తులసి నీళ్ళ ను తాగినట్లయితే ఊహించలేని లాభాలు మీకు అందుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే జీర్ణవ్యవస్థ అనేది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్, అల్సర్, మలబద్ధకం లాంటి సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. అలాగే పేగులో ఉన్నటువంటి మలినాలను కూడా బయటకు పంపిస్తుంది.డయాబెటిస్ తో బాధపడేవారు ఈ నీటిని తాగటం వలన సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ తులసి అనేది రక్తంలో ఉండే షుగర్ లేవల్స్ ను కూడా అదుపులో ఉంచుతాయి. అలాగే గుండె ఆరోగ్యం కూడా ఎంతగానో మెరుగుపడుతుంది.
అంతేకాక శరీరంలో ఉండే బాడ్ కొలెస్ట్రాల్ అనేది కరిగి శరీరం ఎంతో హెల్తీగా ఉంటుంది.నిత్యం ఒక గ్లాస్ తులసి నీళ్లను తాగటం వలన మైగ్రేన్ సమస్య నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. అలాగే తలనొప్పితో బాధపడేవారు ఎప్పుడు కూడా ఈ నీటిని తాగితే మంచి ఫలితం దక్కుతుంది. అలాగే ఒత్తిడి మరియు ఆందోళన తగ్గి మనసు ఎంతో రిలాక్స్ గా ఉండేలా కూడా చేస్తుంది.