Weight Loss : బరువు పెరుగుతారనే భయంతో అల్పాహారం తినడం మానేస్తున్నారా… అయితే ఇది మీకోసమే…!!
Weight Loss : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి బరువు పెరగడం అనేది పెద్ద సమస్యగా మారింది. వీటిని తింటే బరువు పెరుగుతాం, అవి తింటే బరువు పెరుగుతాం అని అంటూ మొత్తానికి అల్పాహారాన్ని తీసుకోవటం మానేస్తున్నారు. అయితే ఇడ్లీలు మరియు దోశలు తినాలని ఎంత కోరిక ఉన్నప్పటికీ ఎక్కడ బరువు పెరుగుతామో అనే భయంతో వాటిని తినడం మానేస్తున్నారు. దీంతో రకరకాల పాశ్చాత్య అల్పాహారాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఆ అభిప్రాయాలని మార్చుకోవాల్సిన టైం వచ్చేసింది. […]
ప్రధానాంశాలు:
Weight Loss : బరువు పెరుగుతారనే భయంతో అల్పాహారం తినడం మానేస్తున్నారా... అయితే ఇది మీకోసమే...!!
Weight Loss : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి బరువు పెరగడం అనేది పెద్ద సమస్యగా మారింది. వీటిని తింటే బరువు పెరుగుతాం, అవి తింటే బరువు పెరుగుతాం అని అంటూ మొత్తానికి అల్పాహారాన్ని తీసుకోవటం మానేస్తున్నారు. అయితే ఇడ్లీలు మరియు దోశలు తినాలని ఎంత కోరిక ఉన్నప్పటికీ ఎక్కడ బరువు పెరుగుతామో అనే భయంతో వాటిని తినడం మానేస్తున్నారు. దీంతో రకరకాల పాశ్చాత్య అల్పాహారాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఆ అభిప్రాయాలని మార్చుకోవాల్సిన టైం వచ్చేసింది. ఎందుకు అంటే రుచిలో రాజీ పడకుండా మరియు బరువు పెరగకుండా ఉండేటటువంటి ఆరోగ్యమైన అల్పాహారాలు మన దక్షిణాదికే సొంతం అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు…
ఈ దక్షిణాది రుచుల్లో ఇడ్లీ మరియు దోశ,పొంగల్, ఉప్మా, ఉతప్పం లాంటివి కొన్ని ఉన్నాయి. ఇక వాటికి చట్నీ మరియు సాంబార్ కలిస్తే రుచి ఎంతో అమోఘం. సాధారణంగా మనం చేసే టిఫిన్ల లో పులియబెట్టి ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇది జీర్ణవ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తుంది. వీటిల్లో ముఖ్యంగా మనం వాడే బియ్యం మరియు పప్పులో మన శరీరానికి ఎంతో అవసరమైన కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి. అలాగే కండరాల మరమ్మత్తు మరియు పెరుగుదలలో కూడా ఇవి ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాక మన వంటింట్లో ఉండే పసుపు మరియు జీలకర్ర, ఆవాలు లాంటివి కచ్చితంగా ఉంటాయి. అయితే పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లోమెంటరీ గుణాలు అనేవి రుతుక్రమ టైంలో సమస్యలు రాకుండా ఉండేందుకు అడ్డుకుంటుంది. అలాగే జీలకర్ర మరియు ఆవాలు అనేవి జీర్ణ ప్రక్రియను ఎంతో సులభం చేస్తాయి…
కిచిడి మరియు బిసిబిలే బాత్ లాంటి అల్పాహారాలలో చిక్కుళ్ళ తో సహా ఎన్నో రకాల కూరగాయలను వాడడం వలన పీచు,విటమిన్లు, ఖనిజాలు అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇది బరువును నియంత్రిస్తాయి. అలాగే ఇడ్లీ ఉడకబెట్టడం మరియు ఉప్మా ను ఆవిరి పట్టటం లాంటి పద్ధతులలో తయారు చేయడం వలన ఆ పదార్థాల్లో పోషకలనేవి పోకుండా ఉంటాయి. దీని వలన కొవ్వులు మరియు కెలరీలు అనేవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే సాంబారు మరియు చట్నీలో ఉపయోగించే చింతపండు,కరివేపాకు, కొబ్బరిలోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు అనేవి లభించటం వలన దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే రాగి దోస లాంటి తక్కువ గ్లైసోమిక్ ఇండెక్స్ కలిగి ఉన్నటువంటి ఆహారం రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించేందుకు కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాక ఆకలి ని కూడా నియంత్రిస్తుంది. కావున మన అల్పాహారాలు అనేవి రుచితో రుచి మరియు ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తాయని నిపుణులు అంటున్నారు…