Smart Phone : వారం రోజులు ఫోన్ దూరం పెడితే ఏం జరుగుతుంది… డిజిటల్ డిటాక్స్ వలన ప్రయోజనం ఏంటి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Smart Phone : వారం రోజులు ఫోన్ దూరం పెడితే ఏం జరుగుతుంది… డిజిటల్ డిటాక్స్ వలన ప్రయోజనం ఏంటి…!!

 Authored By ramu | The Telugu News | Updated on :25 May 2024,7:00 pm

Smart Phone : టెక్నాలజీ అనేది మన జీవితాలకు చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫొన్ కు దూరంగా ఉండటం దాదాపు అసాధ్యం అనిపిస్తుంది. ఉదయాన్నే ఫొన్ ని చెక్ చేయటం, నిద్రపోయే ముందు స్క్రోలింగ్ చేయటం మరియు నోటిఫికేషన్ల చిరుజల్లు ఇవన్నీ మనకు అనుక్షణం అలవాటుగా మారాయి. అయితే మీరు మీ ఫోన్ లో వారం రోజుల పాటు పూర్తిగా దూరంగా ఉంచితే ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా. ఈరోజుల్లో డిజిటల్ డిటాక్స్ అనే పదం చాలా చర్చనీయాంశంగా మారింది. దీని అర్థం డిజిటల్ పరికరాలకు, ముఖ్యంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ల కు, సోషల్ మీడియాకు కొంత కాలం పాటు దూరంగా ఉండాలి. స్థిరమైన స్క్రీన్ సమయం ఆన్ లైన్ ఉనికి మన మానసిక, శారీరక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంది. అందువల్ల డిజిటల్ డిటాక్స్ పాటించాలి అంటూ పలువురు హెచ్చరిస్తున్నారు…

డిజిటల్ ప్రపంచానికి నిరంతరం కనెక్ట్ అయ్యి ఉండటం వలన ఒత్తిడి మరియు ఆందోళన మరియు నిద్ర సమస్యలు ఇలాంటి ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి అని నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ డిటాక్స్ ఈ సమస్యల నుండి ఉపశమనం పొందటానికి సహాయం చేస్తుంది. అయితే ఫోన్ ను వారం రోజులు పాటు పూర్తిగా ఉంచటం అందరికీ అంతా సులభం కాని పని. ప్రారంభంలో అశాంతి, నోటిఫికేషన్లు తప్పిపోతాయి అనే భయం లేక పనిలో ఏదైనా సమస్యలు ఏర్పడతాయి అనే భయం లాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి…

డిజిటల్ డిటాక్స్ ప్రయోజనాలు ఏమిటి?

* మానసిక ప్రశాంతత : నిరంతరం వార్తల ఫీడ్ మరియు నోటిఫికేషన్లు లేకపోవడం వలన మనస్సుకు ఎంతో ఉపశమనం అందుతుంది..

* ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది : ఫోన్ కు దూరంగా ఉండటం వలన ఇతర పనులు చేయటంలో ఏకాగ్రత మరియు శ్రద్ధ అనేది పెరుగుతుంది..

* మెరుగైన నిద్ర : నిద్రపోయే ముందు ఫోన్ వాడటం వలన నిద్ర నాణ్యత అనేది దెబ్బతింటుంది. డిజిటల్ డిటాక్స్ మెరుగుపరుస్తుంది.

* వాస్తవ ప్రపంచానికి కనెక్షన్ : ఫోన్ కి దూరంగా ఉండటం వలన మన చుట్టు ఉన్నటువంటి వ్యక్తులు మరియు పర్యావరణంతో అనుబంధం అనేది బలపడుతుంది..

మీరు డిజిటల్ డిటాక్స్ ని ప్రయత్నించాలనుకుంటే మీరు తీసుకోవలసిన కొన్ని సాధారణ దశలు ఇవే…

1. మీ ఫోన్ కు దూరంగా ఉండటానికి, నిర్ణయిత టైమ్ కేటాయించాలి. ఉదాహరణకు : రాత్రి పూట లేక డిన్నర్ టైంలో మీ ఫోన్ ని సైలెంట్ మోడ్ లో ఉంచాలి..

2. నిద్రపోయే ముందు కనీసం గంట ముందు ఫోన్ ను దూరంగా ఉంచాలి..

3. మీరు తక్కువగా ఉపయోగించే యాప్ ల ను కూడా తీసివేయాలి..

4. మీరు డిజిటల్ డిటాక్స్ లో ఉన్నారు అని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు చెప్పాలి..

5. ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లి పకృతిని ఆస్వాదించండి..

6. పుస్తకాలు చదవండి లేక కొత్త అభిరుచులను అనుసరించండి..

డిజిటల్ డిటాక్స్ అనేది మీ ఫోన్ పూర్తిగా వదులుకోవటం కాదు,కానీ ఇది డిజిటల్ ప్రపంచం పై మీ ఆధార పడడాన్ని తగ్గించేందుకు మీ జీవితాన్ని నియంత్రించడానికి ఒక ఉత్తమమైన మార్గం..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది