Sleep : రాత్రి టైంలో లో దుస్తులు లేకుండా పడుకుంటే… ఎన్ని లాభాలో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sleep : రాత్రి టైంలో లో దుస్తులు లేకుండా పడుకుంటే… ఎన్ని లాభాలో తెలుసా…!!

 Authored By ramu | The Telugu News | Updated on :21 November 2024,3:07 pm

ప్రధానాంశాలు:

  •  Sleep : రాత్రి టైంలో లో దుస్తులు లేకుండా పడుకుంటే... ఎన్ని లాభాలో తెలుసా...!!

Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు నిద్రలేమి కారణం అని నిపుణులు అంటున్నారు. అయితే పడుకునే టైంలో మనం చేసే కొన్ని తప్పులు మన ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతాయి అని అంటున్నారు. సాధారణంగా రాత్రి పడుకునే టైంలో ప్రత్యేక దుస్తులు ధరించటం చాలా మంది చేసే పనే. అయితే కొందరు మాత్రం రోజంతా వేసుకునే బట్టలనే రాత్రి పడుకునే టైంలో కూడా ధరిస్తారు. అయితే ఇది ఏమాత్రం మంచి అలవాటు కాదు అని నిపుణులు అంటున్నారు.

Sleep రాత్రి టైంలో లో దుస్తులు లేకుండా పడుకుంటే ఎన్ని లాభాలో తెలుసా

Sleep : రాత్రి టైంలో లో దుస్తులు లేకుండా పడుకుంటే… ఎన్ని లాభాలో తెలుసా…!!

ముఖ్యంగా చెప్పాలంటే బిగుతూగా ఉండే జీన్స్ ను ధరించి పడుకుంటే పలు రకాల సమస్యలు మన ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి అని అంటున్నారు. అలాగే లో దుస్తుల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు. అంతేకాక రాత్రుళ్ళు నిద్రపోయే టైంలో లో దుస్తులు ధరించడం వలన పలు రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి పూట మహిళలు బ్రా ధరించి పడుకోవడం అంత మంచిది కాదు అని అంటున్నారు నిపుణులు. అయితే మహిళలు బిగుతుగా ఉండే బ్రాను వేసుకొని పడుకోవటం వలన రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగదు. ఇది హైపర్ ప్రిగ్నెంటేషన్ కు కూడా దారితీసే అవకాశం ఉంది అని అంటున్నారు. అలాగే మేలనిన్ ఎక్కువ ఉత్పత్తి అవటం వలన కూడా ఇలా జరుగుతుంది అని అంటున్నారు. అందుకే మీకు వీలైనంతవరకు వదులుగా ఉండే బట్టలను వేసుకొని పడుకోవాలి లేదంటే లేకుండా కూడా పడుకోవచ్చు అని అంటున్నారు.

ఇకపోతే పురుషులు కూడా మిగుతుగా ఉండే అండర్ వేయిర్ వేసుకొని పడుకుంటే పలు రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అధిక వేడి కారణంగా వీర్యకణాల్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. అలాగే చెమట కారణం చేత అలర్జీలు లాంటి చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే లో దుస్తులు లేకుండా పడుకోవడం అలవాటు చేసుకోవాలి అని అంటున్నారు. అయితే మీరు ఇలా పడుకోవడం వల్ల చర్మ సమస్యలు మాత్రమే కాక మానసిక సమస్యలు దూరం అవుతాయి అని అంటున్నారు. అలాగే లో దుస్తులు లేకుండా పడుకోవడం వలన శరీరంలో కార్టిసోల్ స్థాయిలో కంట్రోల్లో ఉంటాయి. దీంతో మానసిక ఆరోగ్యం అనేది ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఇది రక్తపోటును కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. అంతేకాక నిద్రలేమి సమస్యను దూరం చేయటంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది అని నిపుణులు అంటున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది