Fruit or Juice : పండ్లు – జ్యూస్ ‘ ఈ రెండింటిలో ఏది మంచిది .. ?? రెండు ఒకటే కదా అనుకుంటే పొరపాటే..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fruit or Juice : పండ్లు – జ్యూస్ ‘ ఈ రెండింటిలో ఏది మంచిది .. ?? రెండు ఒకటే కదా అనుకుంటే పొరపాటే..!!

 Authored By aruna | The Telugu News | Updated on :10 November 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Fruit or Juice : పండ్లు - జ్యూస్ ' ఈ రెండింటిలో ఏది మంచిది .. ??

  •  రెండు ఒకటే కదా అనుకుంటే పొరపాటే..!!

Fruit or Juice : పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదో అందరికీ తెలుసు. అయితే కొందరు డైరెక్టుగా పండ్లు తింటారు. మరి కొందరు జ్యూస్ లాగా చేసుకొని తాగుతుంటారు. అయితే రెండు పండ్లతో తయారుచేసినప్పటికీ రెండింటిలోను పోషకాల మధ్య చాలా తేడా ఉంటుంది. అయితే వైద్యులు జ్యూస్ కంటే పండ్లను తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు ఒక గ్లాసు జ్యూస్ త్రాగి రోజున ప్రారంభించడం ఆరోగ్యకరమైన మార్గంగా చెబుతున్నారు. పండ్ల రసాలలో చక్కెర ఎక్కువగా , ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇందులో ముఖ్యమైన పోషకాలు ఉండవు. అందుకే పండ్లను రసం కంటే ఎక్కువ ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడింది.

ఫైబర్ మన శరీరానికి చాలా అవసరం. ఇది పేగును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. కానీ పండ్లకు బదులుగా జ్యూస్ తాగినప్పుడు అందులోని ఫైబర్ అంతా ఫిల్టర్ అవుతుంది. దీని వలన శరీరానికి కావలసిన ఫైబర్ అందదు. కాబట్టి జ్యూస్ కంటే పండ్లు తినటమే మంచిది అని వైద్యులు అంటున్నారు. అలాగే పండ్ల రసాలను వివిధ ప్రాసెస్ ల ద్వారా తయారు చేస్తూ ఉంటారు. దీనివలన ఇందులో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి వంటి సూక్ష్మ పోషకాలు పోతాయి. అందుకే ఎక్కువగా పండ్లు తినమని వైద్యులు సూచిస్తున్నారు.

పండ్లను తినడం వలన కడుపు నిండుగా ఉండడంతో పాటు పోషకాలు అందుతాయని పేర్కొంటున్నారు. జ్యూస్ తాగితే కడుపు నిండిన ఫీలింగ్ ఉండదు. అందుకే సాధ్యమైనంత వరకు పండ్లను తినాలని వైద్యులు పేర్కొంటున్నారు. పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. జ్యూస్ రూపంలో తీసుకుంటే క్యాలరీల సంఖ్య పెరుగుతుంది. ఒక్క గ్లాస్ జ్యూస్ తాగితే అందులో పండ్ల రసం ఎక్కువగా ఉంటుంది. కానీ ప్యాక్ చేసిన జ్యూస్ త్రాగితే అందులో చక్కెరను జోడించడం వలన క్యాలరీలు మరింతగా పెరుగుతాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది