Periods : పీరియడ్ సక్రమంగా రావట్లేదని ఆందోళన పడుతున్నారా… అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే…??
ప్రధానాంశాలు:
Periods : పీరియడ్ సక్రమంగా రావట్లేదని ఆందోళన పడుతున్నారా... అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే...??
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అయితే వాటిలలో క్రమరహిత ఋతుక్రమం కూడా ఒకటి అని చెప్పొచ్చు. అయితే చాలా వరకు రుతు చక్రాలు 28 రోజులు ఉన్నప్పటికీ 21 నుండి 35 రోజుల మధ్యలో వస్తూ ఉంటుంది. కానీ 35 రోజులు కంటే ఎక్కువ రోజులు పీరియడ్స్ ఆలస్యం గనక అయితే మాత్రం కచ్చితంగా అప్రమత్తం అవ్వాలి. సాధారణంగా పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి ముఖ్య కారణం హార్మోన్ల మార్పులే. అలాగే పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్ మరియు పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్ అనేవి స్త్రీ తన నెలవారి ఋతుచక్రం సగటు కంటే ఎక్కువ కాలం రాకపోవటానికి ప్రధాన కారణం. అలాగే హార్మోన్ల అసమాతుల్యత ఫలితంగా అండాశయాలపై తిత్తులు అనేవి ఏర్పడినప్పుడు PCOS మరియు PCOD లాంటి హార్మోన్ల సమస్యలు కూడా వస్తాయి.
ఒత్తిడి మీ రెగ్యులర్ పీరియడ్స్ కు కూడా అంతరాయం కలిగించవచ్చు. అలాగే కొన్ని సందర్భాలలో తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు రెండు నెలల వరకు పీరియడ్స్ రాకుండా ఆగిపోతుంది. ఈ ఒత్తిడి హార్మోన్ల వలన కూడా ఉబకాయానికి దారి తీసే ప్రమాదం ఉంది. అలాగే మహిళల్లో రక్తహీనత మరియు ఐరన్ లోపం చాలా సాధారణమైన విషయం. ఈ రకమైన సమస్య శరీరంలో రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేయగలదు. ఇది పిరియడ్స్ కు కూడా అంతరాయాన్ని కలిగిస్తుంది.
సాధారణ శరీర బరువు కంటే తక్కువగా ఉండటం వలన కూడా అండోత్సర్గముతో సహా ముఖ్యమైన శరీర విధులలో మార్పులకు కారణం అవుతుంది. అందుకే తక్కువ బరువు ఉన్న స్త్రీలు తరచుగా ఋతుక్రమ సమస్యలకు ఇబ్బంది పడతారు. మధుమేహం మరియు ఉదలకుహార వ్యాధులు మరియు కొన్ని రకాల పేగు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిలో కూడా హార్మోన్ల అసమతుల్యత కారణంగా రుతుక్రమ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే మీకు కూడా పీరియడ్స్ ఆలస్యంగా వస్తూ ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించటం మర్చిపోవద్దు…