Hair Tips : దీన్ని జుట్టుకు రాయండి.. ఎలా పెరుగుతుందంటే.. మీరే నమ్మలేరు
Hair Tips : నేటి రోజుల్లో జుట్టు సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. జుట్టు సమస్యకు కారణం నేటి రోజుల్లో ఉండే కాలుష్యం అని చాలా మంది చెబుతారు. ఈ కాలుష్యం వలన జుట్టు విపరీతంగా ఊడిపోవడంతో పాటుగా చుండ్రు వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ సమస్యలకు సింపుల్ ఔషధాలతో చెక్ పెట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లోనే ఉండే మనకు విరివిగా లభించే పదార్థాలతో తయారు చేసిన మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం వలన జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
ఇలా చేయడం వలన తమకు సత్ఫలితాలు కూడా వచ్చాయని చాలా మంది చెబుతున్నారు.జుట్టు రాలిపోకుండా బలంగా ఉండేందుకు మన ఇంట్లో ఉండే పదార్థాలతో కాపాడుకోవచ్చునని చెబుతున్నారు. ఇంట్లో మనకు లభించే బియ్యం, మెంతులు, నారింజ లేదా కమలా తొక్కలను ఉపయోగించి మన జుట్టును హెల్తీగా ఉంచుకోవచ్చునని చెబుతున్నారు. బియ్యం ఎంత పరిమాణంలో తీసుకుంటామో అన్ని స్పూన్ల మెంతుల్ని కూడా తీసుకుని నాన బెట్టుకోవాలి. ఒక గ్లాసులో బియ్యం, మెంతులను తీసుకుని గ్లాసు మునిగేంత వరకు నీటితో నింపాలి.
Hair Tips : బియ్యంతో సింపుల్ గా..
ఆ నీటిలో కమలా తొక్కలను వేయాలి. ఒకరోజు రాత్రి మొత్తం ఇలా నానబెట్టాలి. మరుసటి రోజు ఆ మిశ్రమానికి అలోవేరా జెల్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జట్టుకు బాగా అప్లై చేసుకోవాలి. ఒక 40 నుంచి 50 నిమిషాల తర్వాత ఒక మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జట్టు తలతలా మెరుస్తూ ఉంటుంది. నారింజ తొక్కలలో ని విటమిన్ సీ తలలోని చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. బియ్యం నీటిలోని ప్రొటీన్ జట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ సింపుల్ చిట్కాను వాడడం వలన జట్టు కుదుళ్ల నుంచి చివర వరకు ఒత్తుగా తయారవుతుంది.