Kalvakuntla Kavitha : సుమారు ఏడున్నర గంటల పాటు కవితను విచారించిన సీబీఐ.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముగిసిన విచారణ
Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణ తాజాగా ముగిసింది. ఆదివారం ఉదయం 11.30 కు సీబీఐ అధికారులు హైదరాబాద్ లోని కవిత నివాసానికి చేరుకున్నారు. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 6.30 వరకు సుమారు 7 గంటల పాటు కవితను అధికారులు విచారించారు. ఆమెపై పలు ప్రశ్నలను సంధించారు.
కవిత ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఆమె అడ్వకేట్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగింది. తమకు ఉన్న సందేహాలను సీబీఐ అధికారులు కవితను అడిగి తెలుసుకున్నారు. లిక్కర్ కేసుపై నిందితుల్లో ఒకరైన అమిత్ అరోరా ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం.. సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించినట్టు సమాచారం. సెల్ ఫోన్లను ధ్వంసం చేయడంపై కూడా అధికారులు ఆమెను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. మరోసారి విచారణ ఉంటుందా? ఉండదా అనేది తెలియదు కానీ.. దాదాపు 7 గంటల పాటు విచారణ జరగడంతో సీబీఐ అధికారులు దాదాపుగా కవితను అడగాల్సిన
Kalvakuntla Kavitha : మరోసారి విచారణ ఉంటుందా?
అన్ని ప్రశ్నలను అడిగినట్టు తెలుస్తోంది. సీఆర్పీసీ 160 కింద కవితకు నోటీసులు ఇవ్వడంతో ఇంకా అధికారులకు ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం ఉంది. ఇక.. విచారణ సమయంలో కవిత ఇంట్లోకి ఎవ్వరినీ అనుమతించలేదు. కవిత ఇంటి ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత ఒకే సంవత్సరంలో అన్ని ఫోన్లను ఎందుకు మార్చారు? ఎన్ని సెల్ ఫోన్లను ధ్వంసం చేశారు. నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా.. కవితను అధికారులు ప్రశ్నించారు. విచారణ పూర్తయిన తర్వాత అటు కవిత కానీ.. ఇటు సీబీఐ అధికారులు కానీ మీడియాతో మాత్రం మాట్లాడలేదు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.