Kokapet Land Auction: హైదరాబాద్ లో కోకాపేట భూములకు అంత డిమాండ్ ఎందుకు..? ఎకరా 100 కోట్లు..!!
Kokapet Land Auction: హెచ్ఎండిఏ కోకాపేట నియో పోలీస్ ఫేజ్ 2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో నిధుల సమీకరణలో భాగంగా గండిపేట మండలం కోకాపేటలో హెచ్ఎండిఏ చేపట్టిన భూముల అమ్మక ప్రక్రియలో రికార్డు స్థాయి ధర పలికింది. ప్రభుత్వం చేపట్టిన కోకాపేట భూముల వేలంలో హాట్ కేకుల్లా ఫ్లాట్లు అమ్ముడుపోతున్నాయి.
గురువారం రెండో విడత కింద భూముల వేలం చేపట్టగా ఫేజ్ 2లో భాగంగా 6,7,8,9 ఫ్లాట్ లకు వేలం వేయడం జరిగింది. ఈ క్రమంలో గజం ధర సరాసరి 1.5 లక్షలు పలకగా ఈ లెక్కన ఎకరం భూమికి 35 కోట్ల ధరను హెచ్ఎండి నిర్ణయించగా..వేలం ప్రక్రియలో అత్యధికంగా ఎకరం భూమి ధర 100 కోట్లు పలకటం సంచలనం సృష్టించింది. ఫ్లాట్ నెంబర్ 10కి ఎకరానికి 100 కోట్ల రూపాయలు బిడ్ దాఖలు అయ్యింది. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ద్వారా 35 కోట్లు ఉండగా.. వేలంలో వందల కోట్లు పలకటంతో మొత్తంగా 45 ఎకరాల్లో ఉన్న ఏడు ఫ్లాట్ లతో ₹3319 వేల కోట్లను అర్జించింది.
ఈ వేలంలో పాల్గొన్న పలు రియాల్ ఎస్టేట్ ఇతర సంస్థలు పోటాపోటీగా రేటు పెంచాయి. అయితే కోకాపేట భూముల ధరలు ఈ రకంగా పెరగడానికి ప్రధాన కారణం నియో పొలీస్… లే అవుట్ లో స్థలాలను కొనుగోలు చేస్తే తమ ఇమేజ్ పెరుగుతుందని స్థిరాస్తి సంస్థలు భావించడమే. కాగా గత ఏడాది ఈ వేలం ప్రక్రియలో అత్యధికంగా ఎకరం 60.2 కోట్ల ఆదాయం పలకగా ఈసారి 100 కోట్లు పలికింది. గత ఏడాది వేలంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలు అభివృద్ధి సంస్థలు పోటీ పడి దక్కించుకున్నాయి. కానీ ఈసారి ఇతర రాష్ట్రాల కంపెనీలు కూడా భూములను దక్కించుకోవడం విశేషం.