Biogas : ఆదర్శం: 77 ఏళ్ల బామ్మ పాతికేళ్లుగా బయో గ్యాస్ తో 50 శాతం ఎల్‌పీజీ గ్యాస్ ను ఆదా చేస్తోంది
Biogas : ప్రస్తుతం పట్టణం నుండి మొదలుకుని పల్లెటూరు వరకు అన్ని చోట్ల కూడా ఎల్ పీ జీ గ్యాస్ వినియోగం విపరీతంగా పెరిగింది. గతంలో కట్టెలను ఎక్కువగా వంట కోసం పల్లెటూర్లలో వినియోగించే వారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. పల్లెల్లో కూడా కట్టెలను వాడటం లేదు. పర్యవరణం సేఫ్ అయ్యిందని భావిస్తుంటే ఎల్ పీజీ గ్యాస్ వినియోగం విపరీతంగా పెరిగి పోయి మళ్లీ ఆందోళన కలిగిస్తుంది. ఈ విషయం ప్రతి ఒక్కరు కాస్త ఆలోచించాల్సిన విషయం. ఇందన వనరులను కాస్త జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే గ్యాస్ ను సొంతంగా తయారు చేసుకోవాలని కొందరు ఆలోచన చేస్తున్నారు. కాని చాలా మందికి సాధ్యం కాని సొంత గ్యాస్ ను 77 ఏళ్ల బామ్మ సుసాధ్యం చేసుకుంది.
ఇంటి అవసరాల కోసం బయో గ్యాస్..Biogas
పుణెలోని కార్వే నగర్ లో 77 ఏళ్ల విమల్ దిఘే అనే వృద్దు రాలు ఉంటుంది. ఆమె దాదాపుగా పాతిక సంవత్సరాలుగా వంట గ్యాస్ ను సగానికి పైగా ఆదా చేస్తున్నారు. ఆమె వంట చేయడం కోసం కట్టెలను కాని గ్యాస్ ను కాని ఎక్కువ వాడటం లేదు. ఆమె ఇంట్లో ఉన్న వృధా పదార్థాలతో బయో గ్యాస్ ను తయారు చేస్తున్నారు. బయోగ్యాస్ ను సొంతంగా తయారు చేయడం వల్ల ఎంతో ఇందనం ఆదా అవుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఆమె తన ఇంటికి అవసరం అయిన 50 శాతం కు పైగా బయో గ్యాస్ ను సొంతం గా తయారు చేస్తున్నారు. ఈ కారణంగా ఆమె ను ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటున్నారు. బయో గ్యాస్ తయారీ పెద్ద కష్టం ఏమీ కాదు. కాని ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం చిన్న దానికి అంత గా రిస్క్ చేయడం ఎందుకులే అని చాలా మంది భావించి ఆ దిశగా ప్రయత్నాలే చేయడం లేదు.
వ్యర్థాలను వినియోగించాలనే ఉద్దేశ్యంతో…
విమల్ దిఘే మాట్లాడుతూ నేను ఏది కూడా వృదాగా వదిలేయాలని అనుకోను. అలా వచ్చిన ఆలోచనే ఈ బయో గ్యాస్. మా ఇంట్లో రెగ్యులర్ గా ఆహార పదార్థాలు కుల్లిన పదార్థాలు ఇంకా అనేక పదార్థాలు పడేస్తూ ఉంటాం. అందుకే దాన్ని జాగ్రత్తగా వినియోగించుకునే ఉద్దేశ్యంతో బయో గ్యాస్ కు సంబంధించిన విషయాన్ని తెలుసుకున్నాను. బయోగ్యాస్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం కు పెద్ద గా ఖర్చు కూడా ఏమీ కాలేదు. వ్యర్థాలను కాస్త నీటితో కలిపి బయో గ్యాస్ ట్యాంక్ లో వేయడంతో పాటు వృదాలను ఎక్కవగా వేయడం కోసం ట్యాంక్ ను ఏర్పాటు చేసినట్లుగా చెప్పుకొచ్చారు. తాను ప్రతి నెల కూడా 50 శాతంకు పైగా బయో గ్యాస్ తో ఎల్ పీజీ గ్యాస్ ను ఆదా చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ బామ్మ దారిలో అంతా కూడా ఇలా బయో గ్యాస్ కు వెళ్తే ఎల్ పీ జీ గ్యాస్ 50 శాతం ఆదా అవుతుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించదగ్గ విషయంగా విశ్లేషకులు చెబుతున్నారు.