ఐఏఎస్ కావాలనుకున్నాడు .. టీ అమ్ముతూ కోటీశ్వరుడు అయ్యాడు ..!
దేశంలో ఎంతోమంది విద్యార్థులు ఐఏఎస్ కావాలని కలను నెరవేర్చుకోవడం కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు. కొంతమంది ఆలస్యంగా అయినా కలను నెరవేర్చుకుంటే మరికొందరు కలలు నెరవేర్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఐఏఎస్ కావాలనుకున్న అనుభవ్ దూబే తన కల నెరవేర్చుకోలేకపోయినా తన తెలివితేటలతో టీ అమ్ముతూ 150 కోట్లు సంపాదించారు. 23 సంవత్సరాల వయసున్న అనుభవ్ ఐఏఎస్ ప్రిలిమ్స్ ఫెయిల్ కావడంతో వ్యాపారవేత్తగా మారాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా గ్రామం కు చెందిన అనుభవ్ దూబేకి ఆనంద నాయక్ అని మంచి స్నేహితుడు ఉన్నాడు. అనుభవ్ తండ్రి బిజినెస్ మెన్ కాగా తన కొడుకు ఐఏఎస్ అయితే బాగుంటుందని భావించాడు. కొడుకుని బాగా చదివించాడు. అయితే ఐఏఎస్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన అనుభవ్ తన తండ్రి కలను నెరవేర్చుకోలేకపోయాడు. ఛాయ్ సుత్తా బార్ అనే కంపెనీకి ఫౌండర్ గా మారి ఐదు సంవత్సరాలలో ఆ కంపెనీని మూడు లక్షల నుంచి కోటి రూపాయల రేంజ్కి ఎదిగేలా చేశారు.
ఆనంద్ నాయక్ తో కలిసి మూడు లక్షల రూపాయలతో అమ్మాయిల హాస్టల్ ఎదురుగా ఆర్ ఫిట్ట్ గా మొదలుపెట్టారు. ప్రస్తుతం దేశంలోనే 195 నగరాలలో చాయ్ సుత్తాబార్ ఉండడం గమనార్హం. ఈ కంపెనీ వార్షిక విలువ 150 కోట్లు కాగా అనుభవ్ నికర విలువ 10 కోట్లు రూపాయలుగా ఉంటుందని తెలుస్తుంది. చాయ్ సుత్తా బార్ లో మట్టి కప్పులు కుల్దాలను ఉపయోగిస్తారు. ఈ కంపెనీలో 150 మందికి పైగా పనిచేస్తున్నారు. వీళ్ళలో ఇంజనీర్లు, ఎంబీఏ చదివిన వాళ్లు కూడా ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా అనుభవ్ తన ప్రతిభతో వ్యాపారంలో సక్సెస్ సాధించాడు. తన సక్సెస్ తో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు