టీచర్లు ప్రతీ విద్యార్థి ఇంటికెళ్లి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

టీచర్లు ప్రతీ విద్యార్థి ఇంటికెళ్లి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి

 Authored By praveen | The Telugu News | Updated on :3 September 2021,7:30 pm

కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి అందరికీ విదితమే. అయినా రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. అయితే, విద్యార్థలు హాజరు శాతం తక్కువగానే ఉంది. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ మండల విద్యాశాఖ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులు ఇళ్లలోనే ఉండిపోయారని, ఇప్పుడు పాఠశాలకు హాజరు కావాల్సిన పరిస్థితులపై అవగాహన కల్పించాలి.

 

విద్యార్థులను ఇప్పటికీ స్కూల్స్ పంపించకుండా ఇంటి వద్దే ఉంచడం వల్ల వాళ్లకు చదువుపైన ఆసక్తి తగ్గిపోయే చాన్సెస్ ఉంటాయి. ఇకపోతే పాఠశాల ఉపాధ్యాయులు ప్రతీ ఒక్క విద్యార్థి ఇంటికెళ్లి వారి తల్లిదండ్రులకు పాఠశాలకు విద్యార్థులను పంపించాలని కోరాలని చెప్పారు. వారికి స్టడీ ఇంపార్టెన్స్ గురించి వివరించాలని సూచించారు. ఈ వీడియా కాన్ఫరెన్స్‌లో ఖమ్మం జిల్లాలోని మండలాల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు స్కూల్స్‌కు హాజరు అయ్యేందుకు కావాల్సిన చర్యలు యుద్ధప్రాతిపదికన తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది