Nalgonda.. గురుకులాల్లో నాణ్యమైన విద్య : ఎమ్మెల్యే భగత్
జిల్లాలోని హాలియాలో ప్రభుత్వం నిర్మించిన మహాత్మ జ్యోతి పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల గురుకుల పాఠశాలను నాగార్జున సాగర్ శాసన సభ్యుడు నోముల భగత్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ గురుకులాల్లో నాణ్యమైన విద్య అందుతున్నదని తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులు కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకుల అధ్యాపకులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగారెడ్డి, శంకరయ్య, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇకపోతే రాష్ట్రంలో ఇటీవల పాఠశాలలు ప్రారంభమైన సంగతి అందరికీ విదితమే. అయితే, గురుకులాలు ఇంకా ప్రారంభం కాలేదు.
కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వాటిని ఇంకా ప్రారంభించలేదు. ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ ముప్పు పొంచిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొవిడ్ నియంత్రణకు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా నిబంధనలు పాటించడం చాలా ముఖ్యమని తెలిపారు.