హరీశ్ ఫుల్ బిజీ.. సిద్దిపేటలో పలు ప్రారంభోత్సవాల్లో మంత్రి

 Authored By praveen | The Telugu News | Updated on :3 September 2021,6:41 pm

టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రజెంట్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరఫున ప్రచారం నిర్వహిస్తూనే, మరో వైపున సిద్దిపేట ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు. ఇకపోతే హుజురాబాద్‌లో బీజేపీ తరఫున బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్, మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.

 

Harish rao about siddipet municipality development

Harish rao about siddipet municipality development

హుజురాబాద్‌లో టీఆర్ఎస్ జెండా ఎగిరితే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పకుంటానని ఈటల రాజేందర్ అన్నారు. ఒకవేళ తాను గెలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంగతులు పక్కనబెడితే..హరీశ్ శుక్రవారం సిద్దిపేటలో సందడి చేశారు. సిద్దిపేట పట్టణంలోని గాంధీ రోడ్‌లో ఏర్పాటు చేసిన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కిర్లోస్కర్ పంప్ సెట్స్ కంపెనీ షోరూమ్, సిద్దిపేట సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను ప్రారంభించారు. మంత్రి వెంట పింక్ పార్టీ కౌన్సిలర్లు, నేతలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

praveen

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి