Medak.. ఉర్సు ఉత్సవాలకు ముస్తాబవుతున్న దర్గా..
మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండల కేంద్రంలోని హజరత్ సయ్యద్ సహెబ్ హుస్సేని ఖాద్రి దర్గా ఉత్సవాలకు ముస్తాబవుతున్నది. ఆదివారం ఈ దర్గాలో ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవ కార్యక్రమాలు దర్గా పీఠాధిపతి సయ్యద్ అహమ్మద్ నూరుల్లా ఖాద్రి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఉత్సాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని, ఉత్సవాలు విజయవంతం చేయాలని దర్గా ఉప పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ అబ్దుల్ ఖాదర్ పాషా, సయ్యద్ శనివారం కోరారు.
ఇకపోతే ఈ దర్గా ఉత్సవాల్లో కుల, మతాలకతీతంగా అందరూ పాల్గొనే సంప్రదాయం ఉందని స్థానికులు ఉంటున్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం చాదర్ సమర్పిస్తారు. స్థానికంగా మాత్రమే కాదు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ దర్గా బాగా ఫేమస్ కాగా, ఇక్కడి ఉత్సవాల్లో పాల్గొనేందుకుగాను చుట్టు పక్కల వారు తరలివస్తుంటారు. దర్గా ప్రాంగణ ప్రాంతంలో ఇప్పటికే రంగుల దీపాలు అలరిస్తున్నాయి. ప్రత్యేక లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. దీంతో స్థానికంగా సందడి వాతావరణం నెలకొంది. ఉత్సవాల్లో పాల్గొంటే మంచి జరుగుతుందని స్థానికుల నమ్మకం.