Nalgonda..డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ
జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్‌లో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మట్టి గణపతులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూర్తిగా నిషేధించాలని కోరారు. ఈ విగ్రహాల వల్ల పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని వివరించారు. మట్టి గణేశ్ ప్రతిమలను పూజించడం ప్రతీ ఒక్కరు అలవాటు చేసుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలన్నారు. పర్యావరణ పరిస్థితులు సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇప్పటికే రోజురోజుకూ పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగం, మితిమీరిన కాలుష్యం, రసాయనాల వాడకం వల్ల ఎన్విరాన్‌మెంట్ కలుషితమవుతున్నదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీనివాసాచారి, పట్టణ కార్యదర్శి నరేష్, నేతలు రాము, యాదగిరి పాల్గొన్నారు. ఇకపోతే పలు ఎన్జీవో సంస్థలు, సామాజిక కార్యకర్తలు ప్రజలకు ఉచితంగా రాష్ట్రవ్యాప్తంగా మట్టి గణేశ్ ప్రతిమలను పంపిణీ చేస్తున్నాయి. జనంలోనూ గతంతో పోల్చితే కొంత అవేర్‌నెస్ పెరిగింది. చాలా మంది మట్టి గణేశులను ప్రతిష్టించేందుకు మొగ్గు చూపుతున్నారు.