Nalgonda..చేప పిల్లల పంపిణీకి సర్వం సిద్ధం

0
Advertisement

ఇటీవల కురిసన భారీ వానలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు జల కళ సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు చేప పిల్లల పంపిణీకి సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఆగస్టులో టెండర్లను పిలవగా, ఆ ప్రక్రియ ముగిసింది. ఇకపోతే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 326 మత్స్య సహకార సంఘాలలో 35 వేల మంది కుటుంబాలు చేపలపై ఆధారపడి బతుకుతున్నాయి. చేప పిల్లల పంపిణీ ద్వారా వారికి మేలు జరుగుతున్నది.

నల్లగొండలో 1,250 సూర్యపేటలో 1,340 యాదాద్రిలో 1,210 చేప పిల్లలను ఈ సారి పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మత్స్సకారులను తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆదుకుంటున్నదని, వారికి ఉపాధి కల్పిస్తున్నదని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. చేప పిల్లలు పంపిణీ చేసిన తర్వాత వాటి పెంపకం బాధ్యత మత్స్యకారులపై ఉండబోతున్నది. ఇకపోతే మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. చేపల పంపిణీలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.

 

 

Advertisement