Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం […]
Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా పెరుగుతున్నాయో.. బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చాయి. మొన్న బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు తగ్గాయి. నిన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగి మహిళలకు షాకిచ్చాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4665 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.25 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,650 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.250 పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5090 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.28 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50900 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.280 పెరిగింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,970 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,240 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,900 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,900 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 గా ఉంది.
ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,900 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,900 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,900 గా ఉంది.
వెండి ధరలు కూడా ఇవాళ భారీగా పెరిగాయి. ఇవాళ ఒక గ్రాము వెండి ధర రూ.57 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే గ్రాము వెండి ధర 60 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.570 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.6 పెరిగింది. కిలో వెండి ధర రూ.57,000 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.600 పెరిగింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.620 కాగా, కిలో వెండి ధర రూ.62000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.570 కాగా, కిలో వెండి ధర రూ.57000 గా ఉంది.