Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :1 September 2022,8:30 am

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినట్టుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా కూడా ఏదో తక్కువగా తగ్గి ఎక్కువగా ధరలు పెరుగుతున్నాయి. మొన్న బంగారం, వెండి రెండు ధరలు తగ్గాయి. నిన్న బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు రెండూ తగ్గాయి.

26 July 2022 Today Gold Rates In Telugu States

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4700 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.25 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.250 తగ్గింది. 24 క్యారెట్లకు ఒక గ్రాము బంగారం ధర రూ.5127 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.27 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.51,270 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.270 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,540 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,860 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,270 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధరరూ.47,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,440 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,270 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,320 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం రూ.47,000 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,270 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,270 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,270 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.50.80 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.3.20 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.508 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.32 తగ్గింది. కిలో వెండి ధర రూ.50,800 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.3200 తగ్గింది.

చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.600 కాగా, కిలో వెండి ధర రూ.60000 గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కూడా 10 గ్రాముల వెండి ధర రూ.600 కాగా, కిలో వెండి ధర రూ.60000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 10 గ్రాముల వెండి ధర రూ.508 కాగా, కిలో వెండి ధర రూ.50800 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది