Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య  ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :11 October 2022,8:30 am

Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య  ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

31 july 2022 today gold rates in telugu states

11 october 2022 today gold rates in telugu states

అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా పెరుగుతున్నాయో.. బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చాయి. మొన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగి షాకిచ్చాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి.

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4760 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.25 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.250 తగ్గింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5193 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.27 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.51,930 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.270 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,420 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది.

ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 గా ఉంది. విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.59.50 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1.30 తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.595 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.13 తగ్గింది. కిలో వెండి ధర రూ.59,500 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.1300 తగ్గింది.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.648 కాగా, కిలో వెండి ధర రూ.64800 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.595 కాగా, కిలో వెండి ధర రూ.59500 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది