Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : బంగారం అనేది ఇప్పుడు విలువైన వస్తువు. ఒకప్పుడు బంగారం గురించి జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు బంగారం అనేది స్టేటస్ కు సింబల్. ఎవరి వద్ద ఎంత ఎక్కువ బంగారం ఉంటే, ఎన్ని ఎక్కువ బంగారు ఆభరణాలు ఉంటే అంత గొప్పోళ్లు అన్నట్టుగా ఉంది నేటి సమాజం. అందుకే బంగారానికి నేడు అంత ఎక్కువ రేటు, అంత ఎక్కువ డిమాండ్. పెళ్లిళ్లు అయినా ఇతర శుభకార్యాలు అయినా బంగారానికి […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :14 October 2022,8:30 am

Today Gold Rates : బంగారం అనేది ఇప్పుడు విలువైన వస్తువు. ఒకప్పుడు బంగారం గురించి జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు బంగారం అనేది స్టేటస్ కు సింబల్. ఎవరి వద్ద ఎంత ఎక్కువ బంగారం ఉంటే, ఎన్ని ఎక్కువ బంగారు ఆభరణాలు ఉంటే అంత గొప్పోళ్లు అన్నట్టుగా ఉంది నేటి సమాజం. అందుకే బంగారానికి నేడు అంత ఎక్కువ రేటు, అంత ఎక్కువ డిమాండ్. పెళ్లిళ్లు అయినా ఇతర శుభకార్యాలు అయినా బంగారానికి ఉన్న డిమాండే వేరు. పెళ్లికూతురుకు కనీసం ఒక అరకిల బంగారం అయినా కొని మెడలో వేయాల్సిందే. ఒకప్పుడు బంగారాన్ని ఎక్కువగా మహిళలే ఆభరణాలుగా ధరించేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. చివరకు పురుషులు కూడా బంగారాన్ని ఆభరణాలుగా చేయించుకొని వేసుకుంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారం ధరను రెట్టింపు చేశాయి. అందుకే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ మాత్రం బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు తగ్గాయి.

2022 april 12th today gold rates in telugu states

14 october 2022 today gold rates in telugu states

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4675 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.46,750 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5100 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.11 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.51,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.110 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,150 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది.

వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.57.30 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1.20 తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.573 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.12 తగ్గింది. కిలో వెండి ధర రూ.58,500 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.1200 తగ్గింది.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.625 కాగా, కిలో వెండి ధర రూ.62500 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.573 కాగా, కిలో వెండి ధర రూ.57300 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది