Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : బంగారం అనేది ఇప్పుడు విలువైన వస్తువు. ఒకప్పుడు బంగారం గురించి జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు బంగారం అనేది స్టేటస్ కు సింబల్. ఎవరి వద్ద ఎంత ఎక్కువ బంగారం ఉంటే, ఎన్ని ఎక్కువ బంగారు ఆభరణాలు ఉంటే అంత గొప్పోళ్లు అన్నట్టుగా ఉంది నేటి సమాజం. అందుకే బంగారానికి నేడు అంత ఎక్కువ రేటు, అంత ఎక్కువ డిమాండ్. పెళ్లిళ్లు అయినా ఇతర శుభకార్యాలు అయినా బంగారానికి […]
Today Gold Rates : బంగారం అనేది ఇప్పుడు విలువైన వస్తువు. ఒకప్పుడు బంగారం గురించి జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు బంగారం అనేది స్టేటస్ కు సింబల్. ఎవరి వద్ద ఎంత ఎక్కువ బంగారం ఉంటే, ఎన్ని ఎక్కువ బంగారు ఆభరణాలు ఉంటే అంత గొప్పోళ్లు అన్నట్టుగా ఉంది నేటి సమాజం. అందుకే బంగారానికి నేడు అంత ఎక్కువ రేటు, అంత ఎక్కువ డిమాండ్. పెళ్లిళ్లు అయినా ఇతర శుభకార్యాలు అయినా బంగారానికి ఉన్న డిమాండే వేరు. పెళ్లికూతురుకు కనీసం ఒక అరకిల బంగారం అయినా కొని మెడలో వేయాల్సిందే. ఒకప్పుడు బంగారాన్ని ఎక్కువగా మహిళలే ఆభరణాలుగా ధరించేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. చివరకు పురుషులు కూడా బంగారాన్ని ఆభరణాలుగా చేయించుకొని వేసుకుంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారం ధరను రెట్టింపు చేశాయి. అందుకే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. మొన్న మాత్రం బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు తగ్గాయి. నిన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ బంగారం, వెండి ధర తగ్గాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4620 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.55 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.550 తగ్గింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5040 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.60 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,400 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.600 తగ్గింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,550 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450 గా ఉంది.
ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది. విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.55.30 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.2 తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.553 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.20 తగ్గింది. కిలో వెండి ధర రూ.55,300 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.2000 తగ్గింది.
చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.605 కాగా, కిలో వెండి ధర రూ.60500 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 10 గ్రాముల వెండి ధర రూ.553 కాగా, కిలో వెండి ధర రూ.55300 గా ఉంది.