Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు, స్థిరంగా వెండి.. ఎంతో తెలుసా?
Today Gold Rates : బంగారం అనేది ఇప్పుడు విలువైన వస్తువు. ఒకప్పుడు బంగారం గురించి జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు బంగారం అనేది స్టేటస్ కు సింబల్. ఎవరి వద్ద ఎంత ఎక్కువ బంగారం ఉంటే, ఎన్ని ఎక్కువ బంగారు ఆభరణాలు ఉంటే అంత గొప్పోళ్లు అన్నట్టుగా ఉంది నేటి సమాజం. అందుకే బంగారానికి నేడు అంత ఎక్కువ రేటు, అంత ఎక్కువ డిమాండ్. పెళ్లిళ్లు అయినా ఇతర శుభకార్యాలు అయినా బంగారానికి […]
Today Gold Rates : బంగారం అనేది ఇప్పుడు విలువైన వస్తువు. ఒకప్పుడు బంగారం గురించి జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు బంగారం అనేది స్టేటస్ కు సింబల్. ఎవరి వద్ద ఎంత ఎక్కువ బంగారం ఉంటే, ఎన్ని ఎక్కువ బంగారు ఆభరణాలు ఉంటే అంత గొప్పోళ్లు అన్నట్టుగా ఉంది నేటి సమాజం. అందుకే బంగారానికి నేడు అంత ఎక్కువ రేటు, అంత ఎక్కువ డిమాండ్. పెళ్లిళ్లు అయినా ఇతర శుభకార్యాలు అయినా బంగారానికి ఉన్న డిమాండే వేరు. పెళ్లికూతురుకు కనీసం ఒక అరకిల బంగారం అయినా కొని మెడలో వేయాల్సిందే. ఒకప్పుడు బంగారాన్ని ఎక్కువగా మహిళలే ఆభరణాలుగా ధరించేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. చివరకు పురుషులు కూడా బంగారాన్ని ఆభరణాలుగా చేయించుకొని వేసుకుంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారం ధరను రెట్టింపు చేశాయి. అందుకే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. మొన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఇవాళ బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4645 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.25 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.250 పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5067 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.27 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,670 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.270 పెరిగింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.40,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,820 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,720 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.55.30 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.553 గా ఉంది. కిలో వెండి ధర రూ.55,300 గా ఉంది. చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 10 గ్రాముల వెండి ధర రూ.553 కాగా, కిలో వెండి ధర రూ.55300 గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.605 కాగా, కిలో వెండి ధర రూ.60500 గా ఉంది.