Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : బంగారం అనేది ఇప్పుడు విలువైన వస్తువు. ఒకప్పుడు బంగారం గురించి జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు బంగారం అనేది స్టేటస్ కు సింబల్. ఎవరి వద్ద ఎంత ఎక్కువ బంగారం ఉంటే, ఎన్ని ఎక్కువ బంగారు ఆభరణాలు ఉంటే అంత గొప్పోళ్లు అన్నట్టుగా ఉంది నేటి సమాజం. అందుకే బంగారానికి నేడు అంత ఎక్కువ రేటు, అంత ఎక్కువ డిమాండ్. పెళ్లిళ్లు అయినా ఇతర శుభకార్యాలు అయినా బంగారానికి […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :20 October 2022,8:30 am

Today Gold Rates : బంగారం అనేది ఇప్పుడు విలువైన వస్తువు. ఒకప్పుడు బంగారం గురించి జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు బంగారం అనేది స్టేటస్ కు సింబల్. ఎవరి వద్ద ఎంత ఎక్కువ బంగారం ఉంటే, ఎన్ని ఎక్కువ బంగారు ఆభరణాలు ఉంటే అంత గొప్పోళ్లు అన్నట్టుగా ఉంది నేటి సమాజం. అందుకే బంగారానికి నేడు అంత ఎక్కువ రేటు, అంత ఎక్కువ డిమాండ్. పెళ్లిళ్లు అయినా ఇతర శుభకార్యాలు అయినా బంగారానికి ఉన్న డిమాండే వేరు. పెళ్లికూతురుకు కనీసం ఒక అరకిల బంగారం అయినా కొని మెడలో వేయాల్సిందే. ఒకప్పుడు బంగారాన్ని ఎక్కువగా మహిళలే ఆభరణాలుగా ధరించేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. చివరకు పురుషులు కూడా బంగారాన్ని ఆభరణాలుగా చేయించుకొని వేసుకుంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారం ధరను రెట్టింపు చేశాయి. అందుకే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. మొన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్న బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు తగ్గాయి.

27 July 2022 Today Gold Rates In Telugu

20 october 2022 today gold rates in telugu states

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4655 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.13 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.46,550 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.130 పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5078 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.14 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,780 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.140 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,270 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,840 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780 గా ఉంది.

ఇక వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.56.40 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 20 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.564 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.2 తగ్గింది. కిలో వెండి ధర రూ.56,400 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.200 తగ్గింది.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.615 కాగా, కిలో వెండి ధర రూ.61500 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.564 కాగా, కిలో వెండి ధర రూ.56400 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది